లైవ్ షోలో సింగర్ గీతా మాధురితో బాలకృష్ణ అలా చేయడాన్ని పాయింట్ అవుట్ చేస్తున్న జనాలు.!?

బాలకృష్ణ చాలా ఎనర్జిటిక్ హీరో ఇందులో నో డౌట్. ఆడియో  రిలీజ్ ఫంక్షన్ అయినా మరే సాంస్కృతిక ఫంక్షన్ అయినా తన ఫర్ఫార్మెన్స్ తో ఇరగదీస్తాడు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న లేపాక్షి ఉత్సవాల్లో కూడా బాలకృష్ణ చాలా యాక్టివ్ గా కనిపించారు. ఈ సందర్భంగా కొన్ని పాటలను ఆయనే స్వయంగా పాడి ప్రేక్షకులను అలరించారు. అంతా ఓకే కానీ బాలకృష్ణ లైవ్ల షోలో చేసిన ఓ పనిని మాత్రం చాలా మంది పాయింట్ అవుట్ చేస్తున్నారు. చాలా మంది పాటలు పాడేటప్పుడు ఇది కామనే అని లైట్ గా తీసుకుంటున్నా…కొంతమంది మాత్రం MLA స్థాయి వ్యక్తి ఇలా చేయడం కరెక్ట్ కాదని తమ వర్షన్ తాము వినిపిస్తున్నారు.

అసలేం జరిగిందంటే…

లేపాక్షి ఉత్సవాల్లో బాలకృష్ణ తన డిక్టేటర్ సినిమాలోని గణగణగణాగణ..ఆంద్రా తెలంగాణ అనే పాటను గీతామాధురితో కలిసి పాడారు. అయితే ఈ పాట పాడుతూ పాటలోలీనమైన బాలయ్య గీతామాధురిని తన బ్యాక్ తో పుష్ చేశారు. ఇది పాట వింటున్నప్పుడు బాగానే అనిపించిన తర్వాత మాత్రం చాలా మందికి కాస్తంత ఇబ్బందిగా అనిపించింది. ఓ లేడీ సింగర్ ను అలా తోయడం, అది కూడా శాసనసభ్యుడిగా ఉన్న బాలకృష్ణ చేయడం కొంతమందికి ఇబ్బందికరంగా ఉందట.

Watch Balakrishna Song:

 

Comments

comments

Share this post

scroll to top