సిఎం సీటు బాలయ్య బాబుకేనా..?

గిర్కీలు కొడుతున్న రేవంత్ కేసుకు, బాలయ్య బాబు సిఎం ఛాన్స్ కు  లింకేంటి? నారా వారి నుండి ముఖ్యమంత్రి పీఠం నందమూరి వంశానికి షిఫ్ట్ అవుతుందా? హిందూ పురం ఎమ్మెల్యే కు  చీఫ్ మినిష్టర్ సీటు కట్టబెట్టనున్నరా? నాకైతే తెలియదు కానీ సోషల్ మీడియో లో మాత్రం ఈ విషయాలే చక్కర్లు కొడుతున్నాయి.

balakrishna may be new cm of ap.JPG fans prediction

 

 

ఓటు కు నోటు వ్యవహారం, బాబు ఫోన్ టాపింగ్ దూమారంతో వేడెక్కిన రాజకీయాలపై సాధారణ ప్రజల భిన్నంగా స్పందిస్తున్నారు. పొలిటికల్ లీడర్లు కూడా డిఫరెంట్ యాంగిల్స్ లో కామెంట్స్ చేస్తున్నారు. లీకైన ఆడియో చంద్రబాబు నాయుడిదే కాబట్టి ఆయన తన పదవికి రాజీనామా చేసి ఆ స్థానాన్ని ఆయన వియ్యంకుడు  హిందూపురం ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ కు అప్పజెప్పాలని అప్పుడే ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుందని  కాంగ్రెస్ నేత షబ్బీర్ అలి సూచించారు. దీని తర్వాత సొషల్ మీడియాలో ఇదే విషయం చాలా సేపు చక్కర్లు కొట్టింది.

 

నందమూరి అభిమానులు కూడా బాలయ్య బాబు కు సిఎం సీటు అంటు పోస్ట్ లలో తమ ఆనందాన్ని  వ్యక్తం చేస్తున్నారు.  వాస్తవానికి ఆడియో టేపు వ్యవహారంలో సరైన సాక్ష్యాలు కోర్టుకు సమర్పించి ఏసిబి అధికారులు చార్జ్ షీట్ దాఖలు చేస్తే,  బాబు తన సిఎం పదవికి రాజీనామా చేయాల్సుంటుంది. గతంలో అక్రమాస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తన పదవికి రాజీనామ చేసి పన్నీర్ సెల్వం ను సిఎం ను చేసింది. బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డి స్కామ్ కేసులో సిబిఐ చార్జిషీటు దాఖలు చేయడంతో, రాజీనామా చేసి తన సీటును తన భార్య రబ్రీ దేవికి ఇచ్చాడు.

 

balakrishna may be new cm of ap

 

 

సో ఇప్పుడు అదే సీన్  రిపీట్ అయితే  చంద్రబాబు రాజీనామా చేసి ఆ స్థానంలో  టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు  నందమూరి తారక రామారావు వారసుడు ప్రస్తుత ఎమ్మెల్యే బాలకృష్ణ కు అందిచడమే బెస్ట్ అనేది ఫ్యాన్స్ వాదన.

 

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top