బాలకృష్ణ ఒక కమెడియన్ అంటున్న నాగబాబు,నాగబాబు ఇలా మాట్లాడటానికి అసలు కారణమేంటి..?

ఆదివారం జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఒక ప్రశ్నకి నాగబాబు బదులిస్తూ బాలకృష్ణ అంటే ఎవరో తెలియదని చెప్పాడు, బాలకృష్ణ గురుంచి మీ అభిప్రాయం ఏంటి అని అడిగిన ప్రశ్న కి, నాగబాబు సమాధానమిస్తూ బాలకృష్ణ అంటే ఎవరో తెలీదని చెప్పాడు, ఆ తరువాత నుంచి సోషల్ మీడియా అంత ఒకటే ట్రోల్ల్స్, నాగబాబు చెప్పిన ఒక్క మాటతో మెగా అభిమానులు V/S నందమూరి అభిమానులు అన్నట్టుగా మళ్ళీ సోషల్ మీడియా లో ఒకరినొకరు దూషించుకుంటూ చెలరేగిపోయారు.

ఒకరు బాలకృష్ణ ని ట్రోల్ చేస్తే, ఇంకొకరు చిరంజీవి ని ట్రోల్ చెయ్యడం. పవన్ కళ్యాణ్ ని ఒకరు ట్రోల్ చేస్తే ఇంకొకరు JR.ఎన్టీఆర్ ని ట్రోల్ చేయడం. ఇలా నిన్న నాగబాబు చెప్పిన ఒక్క మాట తరువాత సోషల్ మీడియా అంత ఒకటే రచ్చ.

బాలకృష్ణ ఎవరో తెలీదు అన్నందుకు క్షమించండి-నాగబాబు

బాలకృష్ణ ఎవరో తెలియదని అన్నందుకు నన్ను క్షమించండి అంటూ నాగబాబు ఇవ్వాళ ఫేస్బుక్ లో ఒక వీడియో పెట్టాడు, బాలకృష్ణ గారిని మర్చిపోడం నిజంగా నా తప్పే, నేను కావాలని చెయ్యలేదు, నన్ను క్షమించండి అంటూ నాగబాబు బాధ పడ్డాడు.

బాలకృష్ణ ఒక కమెడియన్- నాగబాబు

“బాలకృష్ణ గారిని మర్చిపోడం తప్పే, ఆయన చాలా మంచి కమెడియన్. ఎన్టీఆర్, కృష్ణ గారితో కూడా అయన అప్పట్లో నటించారు, హాస్యం పండించడంలో ఆయనది ఒకరకమైన స్టైల్, బాలకృష్ణ గారి గురుంచి ఎంత చెప్పిన తక్కువే. బాలకృష్ణ గారి పూర్తి పేరు వల్లూరి బాలకృష్ణ, మీరు కావాలంటే వికీపీడియా లో సేర్చ్ చేసి అయన హిస్టరీ తెలుసుకోవచ్చు” అని ఫేస్బుక్ వీడియో లో చేప్పాడు నాగబాబు.

నాగబాబు నిన్న మాట్లాడిన మాటలకే సోషల్ మీడియా లో రచ్చ లేపారు, ఇవ్వాళ మళ్ళీ ఆ రచ్చ లో దుమ్ము కలిపి దట్టంగా పొగ ఏర్పడేలా చేసాడు నాగబాబు, ఆ పొగలో ఎంత మంది ఎన్నేసి తిట్టుకుంటారో, ఎంత దూరం వెళ్తారనేది వేచి చూడాలి. అసలే 2019 ఆంధ్ర ఎన్నికలు దేగ్గర్లో ఉన్నాయ్, ఈ సమయం లో నాగబాబు మాటల్తో వేడి పెంచాడు, ఎన్నికలు అయ్యే వరకు ఈ వేడి తగ్గదు.

 

Comments

comments

Share this post

scroll to top