బాలకృష్ణ గౌతమీ పుత్ర శాతకర్ణి టీజర్…నా కత్తికి అంటిన నెత్తుటి చార ఇంకా పచ్చిగానే ఉందంటూ పవర్ ఫుల్ డైలాగ్.

విశ్రాంతి లేదు, విరామం లేదు……………….నా కత్తికి అంటిన నెత్తుటి చార ఇంకా పచ్చిగానే  ఉంది…. సమయం లేదు మిత్రమా…శరణమా? రణమా? అనే డైలాగ్ లతో బాలకృష్ణ 100 సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి టీజర్ ఆకట్టుకుంది. క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రమిది. క్రిష్ సినిమాలే చాలా వైవిధ్యంగా ఉంటాయి. టీజర్ లు, ట్రైలర్లు వాటి హైప్ ను మరింత పెంచుతాయి. అప్పట్లో క్రిష్ డైరెక్ట్ చేసిన కంచె ట్రైలర్ అయితే యూట్యూబ్ లోనే పెద్ద సంచలనం…ఇదిగో ఇప్పుడు గౌతమీపుత్ర శాతాకర్ణి టీజర్ ఆ రేంజ్ లో హల్ చల్ చేస్తుంది.

గుక్కతిప్పుకోకుండా డైలాగ్ చెప్పాలంటే బాలకృష్ణే గుర్తుకువస్తారు. అలాంటి బాలకృష్ణ చేతే…యుద్దానికి సంబంధించిన డైలాగ్ లను చాలా గంభీరంగా పలికించారు క్రిష్. తన సినిమాలతో విమర్శకుల చేత సైతం ప్రశంసలు పొందిన రికార్డ్ ఉన్న క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కూడా విజయం సాధించాలని కోరుకుందాం.

Watch Teaser:

Comments

comments

Share this post

scroll to top