డిక్టేటర్ సినిమాను యూట్యూబ్ లో Upload చేసిన తెలుగు ఛానల్, అది కూడా పైరసీ ప్రింట్!

బాలకృష్ణ హీరోగా  15 రోజుల క్రితం విడుదలైన  డిక్టేటర్ సినిమాను యూట్యూబ్ లో పెట్టేసింది ఓ తెలుగు ఛానల్ . అది కూడా పైరసీ మూవీని తమ అఫీషియల్  యూట్యూబ్ ఛానల్ ల్లో అప్లోడ్ చేసింది. 1 లక్ష 26 వేల మంది సబ్ స్క్రైబర్స్ గా ఉన్న సదరు తెలుగు టివి ఛానల్ తన  యూట్యూబ్ ఛానల్ లో డిక్టేటర్ సినిమా  అప్ లోడ్ చేసిన కొద్ది క్షణాల్లోనే  ఈ సినిమాకు సంబంధించిన యూట్యూబ్ లింక్  విపరీతంగా షేర్ అయ్యిందంట…!  అయితే కొద్ది సేపట్లోనే ఈ లింక్ ను తొలగించేశారు. అప్పటికే ఈ సినిమాను యూట్యూబ్ లో 300+ చూసేశారు.

ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్ల తో నడుస్తున్న నందమూరి బాలకృష్ణ  డిక్టేటర్  సినిమా యూట్యూబ్ లో పెట్టేశారంటే చాలా మంది నమ్మలేదు. కానీ లింక్ ను చూశాక ఆశ్చర్యపోయారు, అది కూడా ఓ టివి ఆషీషియల్ యూట్యూబ్ ఛానల్ లో, అది ఫైరసీ వర్షన్.!

bala

అసలు తెలుగు టివీ ఛానల్ లో   డిక్టేటర్ మూవీని ఎవరు అప్ లోడ్ చేశారు? ఎందుకు అప్లోడ్ చేశారు. అకౌంట్ హ్యాక్ అయ్యిందా..? లేక సిబ్బంది కావాలని చేశారా? లేక తెలియక పొరపాటున చేశారా…? అనేవి తెలియాల్సి ఉంది.  చూద్దాం ఈ విషయం ఎక్కడి వరకు పోతోందో…!?

 

 

Watch Video:

Comments

comments

Share this post

scroll to top