బాలకృష్ణ డిక్టేటర్ సినిమా రివ్యూ&రేటింగ్ (తెలుగులో…)

dictator-movie-review-1000x509

Cast & Crew:

  • నటీనటులు: బాలకృష్ణ, అంజలి.
  • బ్యానర్ : ఏరోస్ ఫిలింస్ ఇంట‌ర్నేష‌న‌ల్ – వేదాశ్వ క్రియేష‌న్స్‌
  • సంగీతం: ఎస్ఎస్‌.థ‌మ‌న్‌
  • సినిమాటొగ్రఫి : శ్యాం.కే.నాయిడు
  • నిర్మాత‌లు: కిశోర్ లుల్లా, సునీల్ లుల్లా, అర్జన్ లుల్లా,
  • స్టోరీ – స్ర్కీన్ ప్లే: కోన వెంక‌ట్‌-గోపీ మోహ‌న్‌-శ్రీథ‌ర్ సీపాన‌

Story:

చంద్రశేఖర్ ధర్మ ( బాలకృష్ణ) ఢిల్లీలో పెద్ద బిజినెస్ మేన్. తన సంపదతో దేశ ఆర్ధిక వ్యవస్థనే శాసించే స్ధాయి వ్యాపార వేత్త. అప్పటి వరకు మాఫీయా వల్ల ఇబ్బందులు పడుతున్న వ్యాపారవేత్తలకు తను అండగా ఉంటూ అందరినీ కాపాడుతుంటాడు. అదే సమయంలో తన పవర్తో రాజకీయాలను, మాఫీయాను శాసిస్తుంటుంది మహిమా రాయ్(రతీ అగ్నిహోత్రి). ఒక ఫ్యాక్టరీ విషయంలో చంద్రశేఖర్ ధర్మ, మహిమా రాయ్ లకు గొడవ అవుతుంది. ఆ ఫ్యాక్టరీని దక్కించుకోవటం కోసం చంద్రశేఖర్ ధర్మకు కావాల్సిన వ్యక్తిని మహిమా రాయ్ అల్లుడు చంపేస్తాడు. దీంతో చంద్రశేఖర్ ధర్మ అతన్ని ఎలాగైనా చంపాలనుకుంటాడు.

ఈ గొడవల్లో చంద్రశేఖర్ ధర్మ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కాత్యాయని (అంజలి)ని మహిమారాయ్ మనుషులు పొడిచేస్తారు. చంద్రశేఖర్ ధర్మకు మహిమా రాయ్తో ఉన్న గొడవలు కారణంగా తాము కూడా చనిపోవాల్సి వస్తుందేమో అన్న భయంతో కుటుంబం కూడా చంద్రశేఖర్ ధర్మను దూరం చేస్తుంది. అలా ఢిల్లీ నుంచి వెళ్లిపోయిన చంద్రశేఖర్ ధర్మ మళ్లీ ఎలాంటి పరిస్థితుల్లో తిరిగి వచ్చాడు. చివరకు మహిమారాయ్, ఆమె అనుచరులు ఏం అయ్యారు అన్నదే మిగతా కథ.

PLUS POINTS:
బాలకృష్ణ నటన
తమన్ సంగీతం
సినిమాటొగ్రఫి
ఎడిటింగ్
సెకండాఫ్ పీక్స్.

MINUS POINTS:
పాతకథ,కథనం
కామెడీ లేకపోవడం.

Verdict:అబ్బాయ్ సినిమాలాగే బాబాయి సినిమా కూడా ఎబోవ్ యావరేజే.

Rating: 2.5 /5

Trailer:

 

Comments

comments

Share this post

scroll to top