బాలయ్య హిందీలో వార్నింగ్ : మోడీని తరిమి తరిమి కొడతాం.! మీడియా చూపించని వీడియో ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని  ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే.చంద్రబాబు చేపట్టిన ఒక రోజు నిరాహార దీక్షలో పాల్గొన్న హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ మోడీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసిన నువ్వు ఒక ద్రోహివి… నిన్ను కొట్టి కొట్టి తరుముతామని, బంకర్‌లో దాక్కున్నా లాక్కొచ్చి బాదుతామంటూ మోడీని హెచ్చరించారు..

ఏపీకి కేంద్రం చేసిన అన్యాయాన్ని దేశానికి తెలియజేసేలా ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన పుట్టిన రోజునాడు నిరాహరా దీక్ష చేపట్టారు.ఈ దీక్షకు సంఘీభావం తెలిపిన బాలక్రిష్ణ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం వ్యవహరిస్తోన్న తీరును  దుయ్యబట్టారు. ఏపీలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదంటూ ఆయన బిజేపి పార్టీ నేతలకు సవాల్ విసిరారు. ఏపీకి ప్రయోజనం చేకూర్చడం కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని , నాలుగేళ్లుగా సామ దాన బేధోపాయాలను ప్రయోగించాం. ఇక మిగిలింది దండోపాయమే అంటూ బాలకృష్ణ తీవ్ర స్వరంతో హెచ్చరించారు.

ప్రధాని మోదీ పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలంటూ ఆయన సూచించారు.  భార్యను గౌరవించడం నేర్చుకోవాలంటూ బాలయ్య హితవు పలికారు.భార్యకు ఉన్న విలువను మోడీకి అర్థం అయ్యే విధంగా హిందీలో మాట్లాడుతూ.. దాన్ని తెలుగులో అనువాదం చేసి చేసిన ప్రసంగం ఢిల్లీకి వినిపించేలా చేశారు. మోడీ చుట్టూ పక్కల ఉన్న వారికి బ్యాండ్ బాజా అవుతుంది అన్నారు. తరిమి తరిమి కొడతాం అని ప్రధానమంత్రి మోడీకి వార్నింగ్ ఇచ్చారు. తప్పించుకోవటానికి బంకర్ లో దాక్కున్నా అక్కడే పూడ్చిపెడతాం అన్నారు.భార్య గురించి బాలయ్య హిందిలీ చేసిన ప్రసంగం అందరిని మీరూ చూడండి.

watch video here:

Comments

comments

Share this post

scroll to top