బ‌క్‌బుక్ గేమింగ్ యాప్‌కు భారీ న‌జ‌రానా..!

ఇండియ‌న్ గేమింగ్ ఇండ‌స్ట్రీలో బ‌క్ బుక్ గేమింగ్ యాప్ రికార్డుల మోత మోగిస్తోంది. భారీ వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. ఎక్క‌డ‌లేని డిమాండ్ ఈ యాప్‌కు ఉంటోంది. మ‌నం మ‌రిచి పోయిన పాత‌కాల‌పు ఆట‌ల్ని ఇందులో పొందు ప‌ర్చారు. దీంతో పిల్ల‌లు, పెద్ద‌లు ఈ యాప్ ప‌ట్ల విప‌రీత‌మైన మోజు పెంచుకున్నారు. దీనిని గ‌మ‌నించిన న‌జారా టెక్నాల‌జీస్ పెద్ద ఎత్తున పెట్టుబ‌డి పెట్టింది. బక్ బుక్ స్టార్ట‌ప్ ముంబై కేంద్రంగా ప్రారంభ‌మైంది. త‌క్కువ స‌మ‌యంలోనే భారీ ఎత్తున ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. దీంతో విప‌రీత‌మైన డిమాండ్ పెరిగింది. గేమ్ ఛేంజ‌ర్, గేమింగ్ సెక్టార్‌లో న‌జారా టెక్నాల‌జీస్ ఇప్ప‌టికే టాప్ పొజిష‌న్‌లో ఉందీ సంస్థ‌. వెర్నాక్యూల‌ర్ సోష‌ల్ కంటెస్టింగ్ ప్లాట్ ఫాంగా వినుతికెక్కింది.

న‌జారా టెక్నాల‌జీస్ కంపెనీకి మ‌నిష్ అగ‌ర్వాల్ స్థాపించారు. మొబైల్ గేమ్స్, కిట్టీ పార్టీస్ పై కాన్ సెంట్రేష‌న్ చేస్తోంది ఈ సంస్థ‌. బ‌క్ బుక్ కూడా ఇదే కోవ‌లో న‌డుస్తోంది. ఈ స్టార్ట‌ప్ వుమెన్స్‌ను టార్గెట్ చేస్తోంది. కిచాడి టెక్నాల‌జీస్ కంపెనీ బ‌క్ బుక్ కు అండ‌గా నిలుస్తోంది. అంతాక్ష‌రీ, సాంప్ సీధి, టోల్ మోల్ కే బోల్ , ఇలాంటి సాంప్ర‌దాయ ఆట‌ల‌న్నీ బ‌క్ బుక్‌లో ఈజీగా ఆడుకోవ‌చ్చు. మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా తీర్చి దిద్ద‌డంలో భాగంగా యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న వారికి కంటెస్ట్ కూడా నిర్వ‌హిస్తోంది ఈ సంస్థ‌. ఓ వైపు గేమ్స్‌లో మెద‌డుకు మేత పెడుతూనే డిఫ‌రెంట్‌గా డిజైన్ చేశారు నిర్వాహ‌కులు. ఈ యాప్ పిల్ల‌ల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. ఏ స‌మ‌యంలోనైనా ఆట‌లు ఆడేందుకు వీలుగా దీనిని రూపొందించారు.

ప్ర‌స్తుతం ఈ యాప్ హిందీలోనే ల‌భిస్తోంది. త్వ‌ర‌లో మ‌రో 10 భార‌తీయ భాష‌ల్లోకి అందుబాటులోకి తీసుకు రావాల‌న్న‌ది ల‌క్ష్యంగా పెట్టుకుంది ఈ సంస్థ‌. బ‌క్ బుక్ కంపెనీ ..ప్ర‌తి రోజు సోష‌ల్ కంటెస్ట్ నిర్వ‌హిస్తోంది. నాలెడ్జ్, స్కిల్ బేస్డ్ మైక్రో గేమ్స్ ఏర్పాటు చేసింది. ఇండియాలో ఉన్న మ‌హిళ‌ల‌కు ఈ గేమ్స్ ప్ర‌త్యేకంగా రూపొందించిన‌ట్లు బ‌క్ బుక్ యాప్ సిఇఓ అభిన‌య్ జైన్ తెలిపారు. ఇవాళ వేలాది మంది స్మార్ట్ ఫోన్ల‌ను వినియోగిస్తున్నారు. ముఖ్యంగా ఉమెన్స్ పార్టిసిపేష‌న్ త‌క్కువ‌గా ఉంటోంది. దీనిపైనే ఎక్కువ‌గా బ‌క్ బుక్ దృష్టి పెట్టింది. సోష‌ల్ కంటెస్టింగ్ తో పాటు గేమ్స్ కూడా మ‌హిళ‌ల‌కు అల‌వాటు చేయాల‌న్న సంక‌ల్పంతోనే దీనిని ఎష్టాబ్లిష్ చేశారు. బ‌క్ బుక్ యాప్‌ను ..కంపెనీని 2018 ఆగ‌స్టులో లాంచ్ చేశారు. దీని భాగ‌స్వాములుగా అభిన‌య్, శ‌షాంక్ , రోహిత్ నాయుడులు ఉన్నారు.

నాన్ మెట్రో సిటీస్‌కు చెందిన 70 శాతం మంది మ‌హిళ‌లే ఈ గేమింగ్ యాప్‌ను వాడుతున్నారు. ఇంట‌ర్నెట్‌లో 5ఎక్స్ రేటింగ్‌తో ఈ యాప్ దూసుకెళుతోంది. రోజు రోజుకు గేమింగ్ ఇండ‌స్ట్రీలో కొత్త పుంత‌లు తొక్కుతూ గ‌ణ‌నీయ‌మైన వ్యూవ‌ర్‌షిప్ సాధిస్తున్న ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసేందుకు న‌జారా టెక్నాల‌జీస్ కంపెనీ ముందుకు వ‌చ్చింది. గ‌తంలో గేమింగ్ కంపెనీస్ మాస్ట‌ర్ మైండ్ స్పోర్ట్స్ లిమిటెడ్, మూంగ్ గ్లాబ్స్ టెక్నాల‌జీస్ ప్రైవేట్ లిమిటెడ్, హాలా ప్లే టెక్నాల‌జీస్ ప్రైవేట్ లిమిటెడ్ పై పెట్టుబ‌డి పెట్టింది. మ‌రో వైపు నెక్ట్స్ వేవ్ మ‌ల్టీమీడియా ప్రైవేట్ లిమిటెడ్‌, నాడ్విన్ గేమింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పై ఇన్వెస్ట్ చేసింది. నాడ్విన్ లో స‌బ్ స్క్రిప్ష‌న్ స‌ర్వీసెస్ అంద‌జేస్తోంది. ఇప్ప‌టికే 61 దేశాల‌కు విస్త‌రించింది ఈ కంపెనీ ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, సౌత్ ఈష్ట్ ఏసియా, ఇండియ‌న్ స‌బ్ కాంటినెంట్ లో సేవ‌లు ల‌భిస్తున్నాయి.

Comments

comments

Share this post

scroll to top