బలవంతంగా ప్రేమికులకు పెళ్లిళ్లు చేసిన బజరంగ్ దళ్..మండిపడుతున్న నెటిజన్స్..!!

బలవంతంగా ప్రేమ జంటలకు పెళ్లిళ్లు చేసిన బజరంగ్ దళ్. ప్రతి ఏటా ఈ తంతు జరుగుతూనే ఉంది, కానీ దీనిని ఆపేవారు, వీరికి అడ్డుపడేవారు లేరు, ముఖ్యంగా పట్టణాలు, సిటీ లలో వీరి వీరంగం ఎక్కువ అయ్యింది వాలెన్ టైన్స్ డే రోజు. పిల్లోళ్ళు ప్రేమ అని తప్పు దోవ పడితే వీలైతే మందలించాలి, లేదా ప్రేమ సరి కాదని చెప్పాలి, వాళ్ళ పైన దాడులు చేసి బలవంతంగా వారికి పెళ్లి చెయ్యడం తప్పు అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

మేడ్చల్ మెదక్ మొదలు.. :

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా తెలంగాణ లోనే బజరంగ్ దళ్ కార్యకర్తలు ఎక్కువగా హడావిడి చేసారు. మేడ్చల్ మెదక్ మొదలు హైదరాబాద్ సికింద్రాబాద్ వరకు వీరు వీరంగం ఆడారు ఇవ్వాళ. చాలా మందికి బలవంతంగా పెళ్లి చెయ్యడమే కాకుండా, వారికి పెళ్లి చేస్తున్న సమయం లో వీడియో రికార్డు చేసి సోషల్ మీడియా లో పెట్టారు.

నార్త్ లో మరీ.. :

నార్త్ ఇండియా లో కొన్ని రాష్ట్రాల్లో మరీ ఘోరంగా ప్రేమ జంటలను చితక బాదడం, అడ్డు అదుపు లేకుండా వారి మీద పడి కొట్టడం, బవలవంతంగా సామూహికంగా వారికి వివాహాలు జరపడం ఎక్కువయ్యారు. వాలెన్ టైన్స్ డే రోజు అంటే ఇష్టం లేదు అనే వాళ్ళు దేశ సంస్కృతి చెడిపోతుంది అనేవాళ్ళు, పక్కదోవ పట్టకుండా నిత్యం చూసుకుంటూ ఉండాలి, అంతే కానీ ఇలా సంవత్సరానికి ఒక సారి వచ్చి మీద పడటం ఏంటని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మిగిలిన రోజులు ప్రేమ జంటలు ఎలా ఉన్నా పర్లేదు కానీ. వాలెన్ టైన్స్ డే రోజు మాత్రం కలిసుంటే పెళ్లి చేస్తాం అంటారు బజరంగ్ దళ్.

Watch Video :

Comments

comments

Share this post

scroll to top