బాహుబలిని తలదన్నే సినిమా అంటూ ప్రచారమవుతున్న భాజీరావ్ మస్తానీ ట్రైలర్ విడుదల..పోటీ ఇచ్చేలానే ఉంది.

భారతీయ సినిమా గర్వించదగ్గ అతికొద్ది మంది దర్శకులలో బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. కళాత్మక చిత్రాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన భన్సాలీ ప్రస్తుతం బాజీరావు మస్తానీ అనే హిస్టారికల్ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు. భారీ అంచనాలతో త్వరలో ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రానుండగా, తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.  మరాటా యోధుడు బాజీరావు, అతని భార్య కాశీబాయ్, ప్రేయసి మస్తానీల మధ్య జరిగిన ప్రేమ కథా చిత్రంగా బాజీరావు మస్తానీ తెరకెక్కింది. రణవీర్ సింగ్ బాజీరావుగా నటిస్తుంటే, అతడి భార్యగా ప్రియాంక చోప్రా, ప్రేయసిగా దీపికపడుకునే నటించారు. యుద్ధానికి తన ప్రేయసి మస్తానీతో కలిసి వెళ్తున్న బాజీరావుతో మొదలైన ట్రైలర్, బాజీరావుపై భార్య కాశీబాయ్ చూపే ప్రేమ, ప్రేయసి మస్తానీ కోసం పరితపించే మస్తానీ… ఇలా ప్రేమ,రొమాన్స్ తో పాటు ప్రత్యర్థులపై యుద్ధంలో బాజీరావు, మస్తానీలు చేసే పోరాటం, భన్సాలీ వేసిన కళాత్మక సెట్టింగ్ లు, సంచిత్ బల్హర నేఫధ్య సంగీతం, ఆర్ట్ డైరెక్టర్ పనితనం ఈ ట్రైలర్ లో హైలెట్ గా ఉన్నాయి.

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బాజీరావు మస్తానీ డిసెంబర్ 18న రిలీజ్ అవుతోంది. ఇక అదే రోజున షారుఖ్, కాజోల్ జంటగా నటించిన ‘దిల్ వాలే’ చిత్రం కూడా అదే రోజున రిలీజ్ అవుతోంది.
Watch Video:

Comments

comments

Share this post

scroll to top