బయట పడ్డ ద్రవిడ్ వీడియో ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.?

రాహుల్ ద్రవిడ్ , ఈ పేరు వినని భారతీయుడు ఉండడు, భారతీయ క్రికెట్ అభిమానులకి రాహుల్ ద్రవిడ్ అంటే యెనలేని గౌరవం ఉంది, రాహుల్ ద్రవిడ్ కి ది వాల్ అని పేరు కూడా ఉంది, టెస్ట్ క్రికెట్ లో రాహుల్ ద్రావిడ్ బరిలోకి దిగాడు అంటే ప్రత్యర్థి టీం కళ్ళలో భయం మొదలవుతాది. ఇంటర్నేషనల్ క్రికెట్ లో తనకంటూ ఒక స్థానం ఏర్పడుచుకున్నాడు ద్రవిడ్, వ్యక్తిగతంగానూ ద్రవిడ్ అంటే అందరికి ఇష్టమే, ప్రస్తుతం ఇండియా అండర్-19 టీం కి కోచ్ గ వ్యవహరిస్తున్నారు ద్రవిడ్.

ప్రస్తుతం ద్రవిడ్ ఉన్నఒక వీడియో సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది. రాహుల్ ద్రవిడ్ ఓ హోటల్ గదిలో ఉండగా లోపలికి ప్రవేశించిన యువతి అతడితో మాటలు కలిపింది. చనువుగా ప్రవర్తిస్తూ పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చింది. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన ద్రవిడ్ జాగ్రత్తగా వ్యవహరించి వివాదంలో చిక్కుకోకుండా బయటపడ్డాడు. లోపలికి వచ్చిన అమ్మాయి అతడి పక్కనే కూర్చుని చనువుగా మాట్లాడుతూ పెళ్లి చేసుకుందామంటూ బలవంతం పెట్టింది. దీంతో ద్రవిడ్ మరో సీటులోకి మారాడు. అక్కడికీ వచ్చి పక్కనే కూర్చున్న యువతికి ద్రవిడ్ నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు.

దీంతో గది బయట ఉన్న తన తండ్రిని పిలిపించిన యువతి.. ఆయనతో కలిపి ద్రవిడ్‌ను ఒప్పించాలని చూసింది.అయితే, ద్రవిడ్ వారి మాటలను సున్నితంగా తిరస్కరించాడు. ఈ వయసులో ఇవన్నీ సరికావని, అనవసర విషయాలను పక్కన పెట్టి కెరీర్‌పై దృష్టి సారించాలని కాస్తంత గట్టిగానే మందలించి పంపించి వేశాడు. అలా ద్రవిడ్ ఆ యువతి బారి నుంచి తప్పించుకున్నాడు.వివాహ రహితుడిగా ద్రావిడ్ కి ఒక పేరు ఉంది, వివాదాలకు ఆడంబరాలకు దూరంగా నిరాడంబరంగా ఉండే వ్యక్తి రాహుల్ ద్రావిడ్.

Comments

comments

Share this post

scroll to top