బాహుబలి లో ప్రభాస్ చేసినట్టు చేయబోయి..ప్రాణాలు కోల్పోయాడు.!

బాహుబలి సినిమాలో ప్రభాస్ చేసిన సాహసాలు రియల్ లైఫ్ లో చేయడానికి ప్రయత్నించి ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఇది. కరీంనగర్ జిల్లాకు చెందిన షబ్బీర్, పెద్దపల్లి లోని గట్టు సింగారం జలపాతాలను చూడడానికి  ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లాడు. స్నేహితుల ముందు ఫీట్స్ ను చేస్తూ ఒక్కసారిగా అక్కడి నుండి జారి పడి మరణించాడు.

బాహుబలి సినిమాలో ప్రభాస్ కొండలను ఎక్కే సీన్లను, తర్వాత ధీవరా మేకింగ్ వీడియో ను కూడా చూపించారు. పిట్టగోడంత ఉన్న వాడినే గ్రాఫిక్స్ సహాయంతో అలా చూపించారని క్లియర్ గా తెలిసిపోతోంది. దానిని చూసి కూడా కుర్రకారు ఇలా ప్రయత్నించడం అవివేకం. గతంలో కూడా స్పైడర్ మ్యాన్, శక్తిమ్యాన్ ను ప్రేరణగా తీసుకొని చాలా మంది కుర్రాళ్లు బిల్డింగ్ ల మీది నుండి దూకి చనిపోయారు. సినిమాలను  ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ను చూసుకుంటూ వాస్తవజీవితానికి చాలా దూరంగా తీయడం కూడా దీనికి ఓ కారణం.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top