అవును నిజమే ది గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి తో, అతని తండ్రి పోటి పడనున్నారు. అసలు తెలుగులో బాహుబలి సినిమాను చూసే ఇతర సినిమాలు వాయిదా పడుతున్న తరుణంలో రాజమౌళి తండ్రి K.V విజయేంద్ర ప్రసాద్ స్కీన్ ప్లే అందించిన హిందీ సినిమా బాహుబలి కి పోటీగా విడుదల కానుంది.
సల్మాన్ హీరోగా నటిచింన బజరంగి భాయిజాన్ చిత్రం జులై 17 విడుదల కానుంది. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తన స్క్రిప్ట్ ను అందించారు. జులై 10 న ది ప్రెస్టేజియస్ మూవీ బాహుబలి విడుదల కానుంది.ఇటు తెలుగు తో పాటు అటు హిందీ లో కూడా ఈ చిత్రం విడుదల కానుంది.
ఒక వైపు కొడుకు తెరకెక్కించిన చిత్రం, మరో వైపు తాను స్క్రిప్ట్ అందించిన చిత్రం ఏడు రోజుల తేడాతో వెండితెర మీదకు రానున్నాయి. వాస్తవానికి రాజమౌళి కి సీనీ బీజం పడింది కూడా తన తండ్రి వద్దే, విజయేంద్రప్రసాద్ మంచి రైటర్ గా ప్రఖ్యాతి పొందారు. బాహుబలి తో సహా రాజమౌళి తెరకెక్కించిన అనేక సినిమాలకు ఆయనే స్క్రిప్ట్ రైటర్. అంతే కాదు బాలకృష్ణ కెరీర్ లో మైలు రాయిగా నిలిచిన సమరసింహా రెడ్డి రైటర్ కూడా ఆయనే.