'బాహుబలి' ట్ర్రైలర్ రివ్యూ, రేటింగ్.

సినిమాల మీద రివ్యూ కామనే…. కానీ కొత్తగా ట్రైలర్ల మీద రివ్యూ ఏంటని కన్ప్యూజ్ కావొద్దు. తెలుగు సినిమా స్టాయిను హాలివుడ్ కు పెంచే ప్రయత్నంలో రాజమౌళి థియేటర్ లోకి విడుదల చేసిన బాహుబలి ది బిగినింగ్ పై సగటు ప్రేక్షకుల తరఫున స్పందించే ప్రయత్నమే ఇది.
మూడు డిఫరెంట్ ప్లేసెస్ నుండి ఓపెనింగ్….. చిన్న పిల్లవాన్ని సూర్య కిరణాలు పడుతుండగా నీళ్లనుండి బయటకు తెచ్చే ఆడచేయి షాట్ తో క్లోసింగ్..

bahubali trailer review

ఈ రెండు నిమషాల ట్ర్ర్రైలర్ తెలుగు సినిమా ప్రేక్షకులను అలరించింది

ట్రైలర్ పాజిటివ్స్:

  • ప్రతి ప్రేమ్ లో మూడు సంవత్సరాల కష్టం కనిపించింది.
  • నన్నెప్పుడూ చూడని కళ్ళు దేవుడిలా చూస్తున్నాయి.. నేనేవర్ని?” ప్రభాస్ డైలాగ్ ట్రైలర్ కే హైలెట్ గా ఉంది.
  • జలపాతాలు, పెద్ద కట్టడాలు, పర్వతాల పై ప్రభాస్ జంప్ లో సినిమాటోగ్రఫి అండ్ గ్రాఫిక్ డిపార్ట్మెంట్ పనితీరు సూపర్.
  • కథ చాలా లోతైనదిగా తెలిపే డిఫరెంట్ సీన్లు.
  • అన్నింటికి మించి అపజయం లేని రాజమౌళి డైరెక్షన్.

నెగెటివ్స్

  • సినిమా పై భారీ అంచనాలు..
  • యుద్దం భీకరంగా జరుగుతుంటే, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం యెదో డ్యూయెట్ సాంగ్ లా ఉండడం
  • అతివేగంతో దూసుకొచ్చే దున్నపోతు విషయంలో గ్రాఫిక్ ఎక్కువై నిజానికి దూరంగా ఉన్నట్టుంది.
  • అంతా ఓకే అనుకుంటున్నా ఏదో ఫీల్ మిస్స‌యిన‌ట్టుగా అనిపిస్తుంది.
  • ఈ మధ్యే రిలీజ్ అయిన గుణశేఖర్ రుద్రమదేవి ట్ర్రైలర్ ధోరణిలో ఉనట్టనిపించింది.

రేటింగ్ ఫర్ ట్ర్రైలర్: 4.25/5(****)

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top