రాజమౌళి…. తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ రేంజ్ కు తీసుకెళ్లిన డైరెక్టర్.మగధీర సినిమాతో తన డైరెక్షన్ పవరేంటో చూపించిన మౌళిగారు, ఈగ సినిమాతో తనలో దాగున్న టెక్నికల్ కింగ్ ను నిద్రలేపాడు. ప్రస్తుతం తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్న బాహుబలి రిలీజ్ కు సమాయత్తమవుతున్నాడు..
అప్పటి వరకు ప్రభాస్ ఫ్యాన్స్ ఖాళీగా ఉంచడం ఎందుకనుకున్నాడో ఏమో…. ఇప్పుడు బాహుబలి సినిమా కొత్త ట్రైలర్ ను విడుదల చేసి ఆన్ లైన్ లో హడావుడి సృష్టిస్తున్నాడు. సినిమా స్టార్టింగ్ నుండి విడతల వారీగా ఫస్ట్ లుక్ లతో అదరగొట్టిన రాజమౌళి.. ఇప్పుడు ఏకంగా రెండు నిమిషాల బాహుబలి ది బిగన్నింగ్ పేరుతో వీడియోను విడుదల చేశాడు. 31 న ఆడియో రిలీజ్ వాయిదా వేసుకున్న సమయంలో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారని 5 సెకండ్ల టీజర్ ను విడుదల చేశారు. అయితే 5 సెకండ్ల టీజర్ పై విమర్శలు రావడంతో మళ్ళీ పక్కా ప్లానింగ్ తో రెండు నిమిషాల టీజర్ ను రిలీజ్ చేశాడు.
ఆ ట్రైలర్ మీ కోసం::
హలో రాజమౌళి గారు…ఇప్పటికే మీ సినిమా కోసం వేయికన్నలతో ఎదురు చూస్తున్న మమ్మల్ని మీ ట్రైలర్ తోనే చంపేశారు గా అంటున్నారు అభిమానులు.