మూడు సంవత్సరాలుగా కష్టపడి జక్కన్న చెక్కిన చిత్రం బాహుబలి, తెర మీద పడింది. ప్రభాస్,రానా,తమన్న,అనుష్క, రమ్యకృష్ణ లు ప్రధాన పాత్రలతో రూపొందించబడిన ఈ సినిమా తెలుగు పరిశ్రమలోనే అత్యంత భారీ బడ్జెట్ ది. అటువంటి చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనిపై మా రివ్యూ రేటింగ్ అండ్ అనాలసిస్.
(ఇది కేవలం మా అభిప్రాయం మాత్రమే – దయచేసి గమనించగలరు)
రేటింగ్: 3
ఓవరాల్ సినిమా:
మొదట్లో కాస్త నెమ్మదిగా స్టార్ట్ అయ్యింది, తర్వాత కొద్ది కొద్దిగా వేగం పుంజుకొని క్లైమాక్స్ కు వచ్చే సరికి గతం లో ఎన్నడూ చూడని ఓ కొత్త విజువల్ వరల్డ్ ను చూపించాడు దర్శకుడు. కానీ సినిమాలోని పాత్రలను ప్రెస్ మీట్ లకు, ప్రమోషన్లకు ఉపయోగించుకోవడం వల్ల తెర మీద కొత్త పాత్రలను చూస్తున్న ఫీల్ ను మిస్ అయ్యారు ప్రేక్షకులు. స్టోరి మరీ పాతదైపోయింది.
అసలు స్టోరీ లైన్:
మహిష్మతి రాజ్యాన్ని చూపిస్తూ సినిమా స్టార్ట్ అవుతోంది. అమరేంద్ర బాహుబలి(ప్రభాస్) కొడుకు మహేంద్ర బాహుబలి(ప్రభాస్) ని, శివగామి పాత్రలోని రమ్యకృష్ణ భల్లాల దేవా (రానా) నుండి కాపాడి జలపాతం కింద నివసిస్తున్న ఒక తెగ దగ్గరకి చేరుస్తుంది. ఆ తెగ పెద్ద ఆ బాబుకి శివుడు(ప్రభాస్) అని పేరు పెట్టుకొని పెంచి పెద్ద చేస్తుంది. జలపాతం అవతల ఏముందనే సందేహం శివుడికి చిన్నతనం నుండి ఉంటుంది దీంతో అనేక సార్లు ప్రయత్నించి విఫలం అవుతాడు. కానీ ఓ సారి అవంతిక ముసుగు దొరకుతుంది. దాని ద్వారా అవంతిక ను ఊహిస్తూ ఒక్క ఉదుటున పర్వతాన్ని ఎక్కేస్తాడు శివుడు. అవంతిక అందానికి ఫిదా అయిన శివుడు ఆమెతో ప్రేమలో పడతాడు. అవంతిక తన అనుచర గణంతో కలిసి పాతికేళ్ళుగా భల్లాలదేవ దగ్గర భానిసగా చిత్ర హింసలకు గురవుతున్న దేవసేన(అనుష్క) ని కాపాడి తీసుకురావడానికి ట్రై చేస్తోంది .కానీ ఆ ప్రయత్నాలన్నీ పలించవు.. అవంతిక కోసం దేవసేన ను భల్లాల దేవ నుండి శివుడు ఎలా కాపాడాడు అనేదే అసలు స్టోరి.
బలాలు:
- అద్బుతమైన స్క్రీన్ ప్లే.
- అంతకు మించిన విజువల్ ఎఫెక్ట్స్.
- సినిమాటోగ్రఫి
- భారీ సెట్స్, సౌండ్ ఎడిటింగ్.
- పోటీపడి నటించిన నటులు
- క్లైమాక్స్
బలహీనతలు;
- మితి మీరిన ఎక్స్ పెక్టేషన్స్.
- చాలా సంధర్భాల్లో హీరోను డామినేట్ చేసే విలన్ పాత్ర.
- పాటలు.
- నెమ్మదిగా కథ ప్రారంభం.
- పాత్రలను ముందుగానే పరిచయం చేయడం.
- స్టోరి మొత్తం ఊహించిందే.
అనాలసిస్:
రాజమౌళి సినిమా అంటేనే స్క్రీన్ ప్లే ఫర్ పెక్ట్ గా ఉంటుంది. బాహుబలి సినిమాలో కూడా అదే జరిగింది. అత్బుతమైన స్క్రీన్ ప్లే తో మరోసారి సూపర్ అనిపించుకున్నాడు జక్కన్న, సెంథిల్ సినిమాటోగ్రఫి ద్వారా చారిత్రాత్మక కథకు సరికొత్త సొగబులు అద్దాడు. విజువల్ ఎఫెక్ట్స్ లో మరోసారి మగధీర ను గుర్తు చేశారు. నటీనటుల నుండి యాక్టింగ్ ను తనకు కావాల్సిన విధంగా పిండుకున్నాడు రాజమౌళి అది అచ్చుగుద్దిన్నట్టు కనిపించింది స్క్రీన్ పైన.
కానీ ముందుగానే పాటలు ఆన్ లైన్లో లీక్ కావడం చేతనో, లేకపోతే కీరవాణి మీద అతి ఎక్స్ పెక్టేషనో కానీ పాటలు ఇంకా అంతగా సింక్ కాలేదు జనానికి, సాంగ్స్ చాలా వరకు ఓకే మూమెంట్ లో వెలుతున్నట్టు అనిపించాయి. ఫ్రెష్ ఫీల్ లేదనిపించింది. ఇక రానా ప్రభాస్ ను చాలా డామినేట్ చేశాడనిపించింది, ముఖ్యంగా యుద్ద సన్నివేశాలలో హీరో కన్న విలన్ యాక్షన్ చాలా బాగుందనిపించింది. సాధారణంగా ఇది రాజమౌళి చిత్రంలో మనకు కనిపించేదే! ముఖ్యంగా రమ్యకృష్ణ, రానా నటన తీరు అదరిపోయింది. పాత్రలకు ప్రాణం పోసారు వారిద్దరు!
మొత్తానికి బాహుబలి సినిమాకు విమర్శకుల నుండి సినీ ప్రముఖుల నుండి ప్రశంసలు అందుతున్నాయి . అత్బుత కళాఖండాన్ని తీర్చిదిద్దడంలో రాజమౌళి సక్సెస్ అయ్యారని చెప్పుకోవొచ్చు.
మూవీ ఇన్ వన్ లైన్: హైప్ ఇచ్చినంత మజా లేదు!