బాహుబలి పైరసీ వచ్చేసిందా?

బాహుబలి పైరసీ వచ్చిందంటూ  సోషల్  మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అసలే పైరసీని ఉక్కుపాదంతో తొక్కేయాలని… ఎక్కడ పైరసీ చేసినా, ఆ థియేటర్ స్క్రీన్  వాటర్ మార్క్ ప్రకారం తెలిసిపోతోందని, బాహుబలి సినిమాను పైరసీ చేసినా, ఫైరసీ చూసిన క్రిమినల్ కేసు నమోదు చేస్తామని బాహుబలి విడుదలకు ముందే సినీ పెద్దలతో కలిసి రామజమౌళి ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు.

bahubali anti piracy

మరి ఇప్పుడు ఎక్కడ చూసినా   బాహుబలి పైరసీ గురించే  ప్రచారం సాగుతోంది, కువైట్ లో బాహుబలి సినిమా  పైరసీ అయ్యిందనే పుకార్లు గట్టిగా వినిపిస్తున్నాయ్, అసలే బాహుబలి పాటలు కూడా విడుదలకు ముందే నెట్ లో హల్ చల్ చేసాయి. అసలే భారీ బడ్జెట్ సినిమా, తెలుగు సినీ పవర్ ను అంతర్జాతీయ రేంజ్ కి తీసుకెళ్లిన సినిమా అలాంటి సినిమా రెండవ రోజే పైరసీ అయితే ఇంకేమయినా ఉందా ? అయితే ఇది ఇంత వరకు దృవీకరణ కాలేదు.

bahubali anti piracy

ఏది ఏమైనా సగటు ప్రేక్షకులుగా , ఎట్టి పరిస్థితులో పైరసీలను మనం ప్రోత్సాహించకూడదు. ఎందుకంటే మనకు  తెలుసు సినీ కష్టాలు. ముఖ్యంగా బాహుబలి సినిమా కోసం మూడేళ్ళుగా కళాకారులు పడ్డ కష్టం. మనమంతా ఇప్పుడు ప్రతిజ్ణ చేయాల్సిన అవసరం వచ్చింది. నేను సగటు సీనీ ప్రేక్షకుడిగా ప్రతిజ్ణ చేస్తున్నాను, పైరసీ ని ప్రోత్సాహించడం కానీ, పైరసీ చేసిన సినిమాను చూడడం కానీ చేయను. 

CLICK: మొదటి రోజే కలెక్షన్ల వర్షం కురిపించిన బాహుబలి.

Comments

comments

Share this post

2 Replies to “బాహుబలి పైరసీ వచ్చేసిందా?”

 1. kalyan says:

  Bahubali ticket in banglore is 400.. can a ordinary man along with family can watch in theatre…?

  1. Murty says:

   Then go & watch the movie in week days not in week ends, I do also stay in Bangalore.
   The statement you had given it like ” the ticket fare is high so we opt for PIRACY”…. If it’s like this It’s Like that then I am very sorry to say you’re in a wrong track.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top