బాహుబలి పార్ట్-2 ను స్టార్ట్ చేశారు!

జక్కన్న చెక్కిన ఆణిముత్యం విడుదలైంది. ఇప్పుడు రికార్డులను బద్దలుకొట్టే పనిలో ఉంది రాజమౌళి బాహుబలి చిత్రం. బాహుబలి ది బిగిన్నింగ్  తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న సినిమాను పక్కన పెట్టి, ఇప్పుడు అందరూ రాజమౌళి తెరకెక్కించనున్న బాహుబలి పార్ట్2 గురించి చర్చలు స్టార్ట్  చేశారు .  ప్రభాస్,రానా,రమ్యకృష్ణ,తమన్నా,అనుష్క,సుదీప్ లతో తెరకెక్కిన మొదటి బాగాన్ని మించిన అటెంక్షన్ తో రెండవ భాగాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది రాజమౌళికి.

bahubali 2

అయితే ట్రయిలర్ ను చూసి సినిమాని ఊహించి చెప్పే మన ప్రేక్షకులకు, ఇక పార్ట్ -1 ను చూసి పార్ట్-2 ను ప్రెడిక్ట్ చేయడం ఎంత పని చెప్పండి.ఇప్పుడు అదే ఊపులో బాహుబలి పార్ట్ 2 స్టోరి ని ఊహించడం స్టార్ట్ చేశారు  నెటీజన్లు.  దానిని మీరూ చదవండి.

నెటీజన్ల ప్రకారం బాహుబలి పార్ట్-2 స్టోరి:

అమరేంద్ర బాహుబలి (పెద్ద ప్రభాస్), బళ్లాలదేవ (రాణా) ఇద్దరూ దేవసేన(అనుష్క)ను ఇష్ట పడతారు. దేవసేన (అనుష్క) మాత్రం బాహుబలిని ఇష్ట పడుతుంది. దీంతో రాజ్యం కావాలా? ప్రేమ కావాలా? అని బాహుబలిని అడిగితే ‘ప్రేమే’ కావాలనుకుని దేవసేన (అనుష్క)తో కలసి రాజ్యం విడిచి బాహుబలి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి దేవసేన (అనుష్క), బాహుబలి (పెద్ద ప్రభాస్) ప్రేమ, పెళ్లి, వాళ్ళ కాపురం, దేవసేన (అనుష్క) గర్భవతి కావడం జరుగుతుంది. అదే సమయంలో మాహిష్మతి రాజ్యాన్ని పాలిస్తున్న బళ్లాల దేవ (రాణా) ప్రజల్ని హింసలు పెడుతూ వుంటాడు. ప్రజల్లోనూ అతడి పాలన మీద తీవ్ర అసంతృప్తి రగులుతుంది. అదే అదునుగా భావించి కాలకేయ తమ్ముడు (చరణ్ దీప్) మహిష్మతి రాజ్యం మీద దండెత్తుతాడు. అప్పుడు మాహిష్మతి ఓడిపోయే స్థితికి వస్తుంది. విషయం తెలుసుకున్న ‘బాహుబలి’ యుద్దంలో పాల్గొని తమ రాజ్యాన్ని కాపాడుతాడు. అటు బాహుబలికి కట్టప్ప చేత వెన్నుపోటు పొడిచేలా బిజ్జలదేవ (నాజర్), బళ్లాల దేవ (రాణా) కలసి కుట్ర పన్నుతారు. బాహుబలిని చంపేస్తారు. అటు దేవసేన (అనుష్క) మగబిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డను చంపేందుకు బిజ్జలదేవ (నాజర్), బళ్లాల దేవ (రాణా)ప్రయత్నిస్తారు. శివగామి (రమ్యకృష్ణ) వాళ్ల ప్రయత్నానికి అడ్డుపడి, వాళ్ళతో పోరాడుతుంది. ఎలాగోలా వాళ్ల నుంచి తప్పించుకోని ఆ బిడ్డ ‘శివుడు'(చిన్న ప్రభాస్)ని గూడెం వాసులకు దొరికేలా చేస్తుంది. ఇక్కడి వరకు జరిగిన కథతో సినిమా ఫ్లాష్ బ్యాక్ కంప్లీట్ అవుతుంది. గతాన్ని తెలుసుకున్న శివుడు తన బలగం అయిన కట్టప్ప సైన్యంతో పాటు , అవంతిక (తమన్నా) సైన్యం, అస్లంఖాన్ (సుదీప్ ) సహకారంతో బళ్ళాల దేవ (రాణా) మీద యుద్ధాన్ని ప్రకటిస్తాడు. ఈ యుద్ధంలో బళ్ళాలదేవ (రాణా) ఓడిపోతాడు. అతడ్ని దేవసేన (అనుష్క) పేర్చిన పుల్లల చితి మీద బ్రతికి వుండగానే కాలుస్తారు. దీంతో బాహుబలి రెండవ భాగానికి శుభం కార్డు పడుతుంది!

ఇది మనవాళ్లు ఊహించిన స్టోరి… అయితే స్టోరి అచ్చుగుద్దినట్టు  ఊహించినా కూడా రాజమౌళి విజువలైజేషన్  చూడాలంటే తెరకు కళ్లప్పగించాల్సిందే!

 

CLICK: ఆ బియ్యం తింటే అంతే సంగతులు.

Comments

comments

Share this post

0 Replies to “బాహుబలి పార్ట్-2 ను స్టార్ట్ చేశారు!”

  1. Kait's Sai Anand says:

    Just as expected, but Part 1 enduku chusaamo same reason tho manam Part 2 chustam. Baahubali creates Trendy, Proud moment for TFI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top