జై మహిశ్మతి ఇది ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల నినాదంగా మారిపోయింది. బాహుబలి విడుదల రోజైతే థియేటర్ల ముందు దీనిని ఓ మంత్రంగా ముక్తకంఠంతో జపించారు అభిమానులు. తర్వాతర్వాత ఇది ఫ్రెండ్స్ ప్లెడ్జ్ గా మారిపోయింది. ఫ్రెండ్స్ అందరూ ఒకరిని ఒకరు కలుసుకొని జై మహిశ్మతి అనుకుంటున్నారు . వాళ్లకు ఇదో సైన్ అయిపోయింది మరి.
ఇప్పుడు ఇదే మహిశ్మతి నినాదం చైనా, జపాన్ లలో మారుమోగబోతోంది. మరికొన్ని రోజుల్లో చైనా, జపాన్ థియేటర్లల్లో మన జక్కన్న చెక్కిన చిత్రం విడుదల కానుందంట! ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలై వసూళ్ల వర్షం కురిపిస్తున్న ‘బాహుబలి’ తాజాగా చైనా, జపాన్ భాషల్లో కూడా విడుదల కానున్నట్టు సమాచారం.

బాహుబలి’ రెండు భాగాలు కలిపి 250 కోట్ల రూపాయల బడ్జెట్ కాగా, తొలి భాగమే ఇప్పటి వరకు 447 కోట్ల రూపాయలను వసూలు చేసి పెట్టింది. ఇప్పుడు తాజాగా ఇదే సినిమా ఆ రెండు దేశాల ప్రేక్షకులను పలకరించనుంది. హాలీవుడ్ చిత్రాలు ఇంగ్లీషు భాష తర్వాత చైనా భాషలోనే ఎక్కువగా విడుదల అవుతాయి. చైనా, జపాన్ ప్రేక్షకులకు హిస్టారికల్ మూవీస్ అంటే మోజెక్కువేనట అందుకే అక్కడ బాహుబలి రిలీజ్ చేయడంలో లేటు వద్దు అనుకుంటున్నారట చిత్ర యూనిట్.
తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళుతున్న రాజమౌళికి తో పాటు బాహుబలి టీమ్ కు ధన్యవాదములు, శుభాకాంక్షలు.