షూటింగ్ లో ఆ బాహుబలి నటిని తన సహనటి ఏం చేసాడో తెలుసా.? దెబ్బకి చెంప చెళ్లుమనిపించింది..!

స్కార్లెట్ విల్సన్, ఈ హాలీవుడ్ భామ పేరు చెబితే ప్రేక్షకులు గుర్తుపట్టకపోవచ్చు. కానీ, రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన బాహుబలి సినిమాలోని ‘మనోహరి’ పాటలో నర్తించిన ఐటెం గర్ల్ అని చెబితే ఠక్కున గుర్తొచ్చేస్తుందేమో. స్కార్లెట్ విల్సన్ ఐటెం గర్ల్‌గా చేసిన మనోహరి పాట ఎంత హిట్టయ్యిందో తెలిసిందే. ఇప్పుడిదంతా ఎందుకంటే, సినిమా షూటింగ్ సమయంలో తోటి నటుడి చెంప చెళ్లుమనిపించింది ఈ భామ.

బిగ్ బాస్ కంటెస్ట్ ప్ర‌వీణ్ రానా ని వివాహం చేసుకున్న ఈ భామ డేర్ 2 డ్యాన్స్ , ఝ‌ల‌క్ దిక్ లాజా వంటి రియాలిటీ షోస్ తో గుర్తింపు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం అక్ష‌య్ కుమార్ గోల్డ్ సినిమాలోను న‌టిస్తుంది . ఇదే కాకుండా బాలీవుడ్ మూవీ ‘హన్స: ఏక్ సన్యోగ్’ అనే చిత్రంలోను న‌టిస్తుంది. అయితే ఈ మూవీ షూటింగ్ లో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న ప్ర‌స్తుతం బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది.

వివరాల్లోకి వెళితే ఉమాకాంత్ రాయ్ అనే నటుడు స్కార్లెట్ తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌డంతో పాటు జుట్టు పట్టుకొని లాగాడాట‌. దీంతో అతడి చెంప పగలగొట్టింది స్కార్లెట్. ఊహించని ఆమె రియాక్షన్‌కు ఆ నటుడు కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. చిత్ర యూనిట్ సభ్యులు కూడా అతడిని అక్కడి నుంచి బలవంతంగా బయటకు పంపించేశారు. దీంతో ఒక్కసారిగా గందరగోళం జరిగింది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ వ్య‌వ‌హారంపై స్కార్లెట్ ఫిల్మ్ చాంబ‌ర్ ఆఫ్ ఇండియాకు కూడా ఫిర్యాదు చేసింది. న‌టుడిగా అత‌డి స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయాల‌ని కోరింది .

watch video:

watch video: Manohari Video Song || Baahubali

Comments

comments

Share this post

scroll to top