ప్రతిష్టాత్మక బాహుబలి చిత్రం రికార్డులను తిరగరాయడమే కాదు. నిర్మాతలకు కాసుల వర్షాన్ని కూడా కురిపిస్తోంది. గత సినిమాల హిస్టరీనంతా క్రిస్టల్ క్లియర్ గా తుడిచిపెట్టేసింది. ఏకంగా హిందీ చిత్రాలను సైతం సైడుకు తోసేసింది. అమెరికాలో అమీర్ ఖాన్ పీకే ను పక్కకు నెట్టి….. అందరి చేత అమ్మో మాయిశ్మతీ అనిపించిందీ బాహుబలి.
ఇండియాలో:
దేశ వ్యాప్తంగా మొత్తం తెలుగు,తమిళం,హిందీ,మళయాళం నాలుగు భాషల్లో 4000 స్క్రీన్స్ పై విడుదలైన చిత్రం తొలిరోజే దాదాపు 32 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డ్ ను నెలకొల్పిందని సమాచారం ! ఇది ఇండియన్ సినీ ఇండస్ట్రీ లోనే ఓ రికార్డ్ . తొలి రోజు 15 లేదా 16 కోట్లను వసూలు చేస్తుందని అంచనా వేసినప్పటికీ ఆ మార్క్ ను అవలీలగా దాటేసింది బాహుబలి.
తెలుగు లో ఇప్పటి వరకు అత్యధిక వసూల్లు సాధించిన చిత్రాలు… అత్తారింటికి దారేది 90 కోట్లు…
అమెరికా లో:
ఒక ఇండియా సినిమా అమెరికాలో 1 మిలియన్ డాలర్లను ( 6 కోట్ల) వసూలు చేయడం ఇదే ప్రథమం. అక్కడి బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసిన సినిమాగా జయకేతనం ఎగురవేసింది మన బాహుబలి. దీంతో అక్కడ ఇప్పటి వరకు కలెక్షన్ల పరంగా టాప్ లో ఉన్న అమీర్ ఖాన్ పీకే చిత్రాన్ని వెనక్కి నెట్టిందంట బాహుబలి సినిమా. USA లోని 118 స్క్రీన్స్ పై పడిందట బాహుబలి మూవీ.
డిస్ట్రిబ్యూషన్ లో:
రాజమౌళి డైరెక్షన్ లో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలుగా తెలుగ, తమిళ బాషలలో నిర్మించి.. హిందీ,మళయాళం భాషల్లోకి డబ్బింగ్ చేసిన బాహుబలి ది బిగిన్నింగ్ ప్రసార హక్కులను కర్నాటక డిస్ట్రిబ్యూటర్ కు 23 కోట్లకు, సీడెడ్ కు 14 కోట్లకు , నైజాం డిస్ట్రిబ్యూషన్ ను 25 కోట్లకు దిల్ రాజుకు, శాటిలైట్ హక్కులను 25 కోట్లకు మాటివి కి అమ్మారు.
సినిమా విషయానికి వస్తే మితిమీరిన అంచనాలను అందుకోవడం లో కాస్త విఫలమయిన జక్కన్న… తన మార్కెటింగ్ స్ట్రాటజీతో, సోషల్ మీడియా ఉపయోగంతో వసూల్ల విషయంలో ఎక్స్ పెక్టేషన్స్ కు మించి కాసులను తెచ్చి పెట్టాడు ప్రొడ్యూసర్స్‌కి. మొత్తానికి బాహుబలి పేరుతో గట్టిగానే జేబులు నింపుకుంటున్నారు నిర్మాతలు.