చరిత్ర తిరగరాసిన “బాహుబలి 2 ” ట్రైలర్… 8 గంటల్లోనే కోటి మంది చూసారు ట్రైలర్!

నిమిషానికి 60వేలు.. గంటకు 12లక్షలు.. 8 గంటలకు కోటి.. ఈ లెక్కలు చూస్తుంటే ఏంటా అనుకుంటున్నారా.. బాహుబలి 2 మూవీ ట్రైలర్ రికార్డ్స్.  దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఒక వీడియోకు కేవలం ఎనిమిది గంటల్లో కోటి వ్యూస్ రావటం సంచలనం అంటున్నారు. ఓ వీడియో ఇంత పెద్ద వైరల్ ఎప్పుడూ కాలేదంటున్నారు యూట్యూబ్ అనలిస్ట్ లు. గతంలో అమీర్ ఖాన్ నటించిన దంగల్ మూవీ 24 గంటల్లో కోటి హిట్స్ తీసుకొచ్చింది. ఇప్పుడు బాహుబలి అయితే సోషల్ మీడియా సునామీ అయ్యింది. దేశంలోని ప్రతి న్యూస్, మూవీ వెబ్ సైట్స్ షేర్ చేయటంతో ప్రతి ఒక్కరి దగ్గరకు రీచ్ అయ్యింది. మార్చి 16వ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు పోస్ట్ చేయటం ఆలస్యం.. పోటాపోటీగా సాగిన షేర్లతో.. వ్యూస్ కౌంట్ లెక్కపెట్టటం సాధ్యం కాలేదు. ప్రతి గంటకు 12లక్షల మంది చూస్తూ.. ఎనిమిది గంటల్లోనే కోటి వ్యూస్ తో యూట్యూబ్ చరిత్రలో బాహుబలి 2 వ్యూస్

Watch Video Here:

బాహుబలి 2 – ది కంక్లూసన్ ట్రైలర్. బాహుబలి 2 ఏప్రిల్ 28 న విడుదల అవుతుంది.

బాహుబలి రెండు భాగాలుగా తీసిన భారత దేశపు చిత్రం. రెండవ భాగం తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో ఒకేసారి విడుదల అవ్వనుంది. మొదటి భాగం 2015 జులై 10 న విడుదల అయింది.

స్క్రీన్ప్లే & డైరెక్షన్: యస్. యస్. రాజమౌళి
సమర్పణ: కె. రాఘవేంద్ర రావు బి.ఏ.
నిర్మాతలు: శోభు యార్లగడ్డ & ప్రసాద్ దేవినేని
స్టోరీ: వి. విజయేంద్ర ప్రసాద్
సినిమాటోగ్రఫీ: కె.కె. సెంథిల్ కుమార్
ప్రొడక్షన్ డిజైనర్: సాబు సైరిల్
మ్యూజిక్ కంపోజర్: యం.యం. కీరవాణి
విఎఫ్ఎక్స్ సూపర్విజన్: ఆర్ సి కమల కణ్ణన్
సౌండ్ డిజైన్: పి.యం. సతీష్, మనోజ్ ఎం గోస్వామి
స్టంట్ కొరియోగ్రఫీ: కింగ్ సోలమన్, లీ విట్టాకర్, కేచ కంపక్డీ
డాన్స్ కొరియోగ్రాఫేర్స్: ప్రేమ్ రక్షిత్, శంకర్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు
కాస్ట్యూమ్ డిజైనర్: రమా రాజమౌళి, ప్రశాంతి త్రిపిర్నేని
డైలాగ్స్:
తెలుగు – సి.హెచ్. విజయ్ కుమార్, అజయ్ కుమార్ జి

 

Comments

comments

Share this post

scroll to top