“కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు..?” అనే ప్రశ్నకు జవాబు దొరికేసింది. “బాహుబలి – 2 ది కంక్లూషన్” ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. రికార్డుల వరద సృష్టించింది. ప్రపంచానికి తెలుగు సినిమా గొప్పతనం ఏంటో పరిచయం చేసారు మన “జక్కన”. సినిమా చూసిన ఆడియన్స్ అందరు బాహుబలి పై ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. అసలు బాహుబలి సినిమాను వర్ణించలేము అంట. అంత హై రేంజ్ లో ఉంది మూవీ..!
బాహుబలి మీద ఎన్నో ఫన్నీ కామెంట్స్ కూడా నెటిజన్లు చేశారు. తమ క్రియేటివిటీ జోడించి తమకు తోచినట్టుగా ఫోటోలు తయారు చేసి పోస్ట్ చేశారు.అయితే ఇదంతా సరదాకోసమే చేశారు. తాజాగా ఐటీ కన్ను బాహుబలిపై పడింది. నిత్యం ప్రోగ్రామింగ్‌లతో బిజీగా ఉండే టెక్కీలు తమ క్రియేటివిటీని జోడించి బాహుబలిలోని క్యారెక్టర్స్‌ను వారి ఆఫీసులో ఉండే ఎంప్లాయి నుంచి హెచ్ఆర్ మేనేజర్ వరకు పోలుస్తూ ఫన్నీగా పోస్టులు పెట్టారు.
సాఫ్ట్ వేర్ కంపెనీలో బాహుబలి క్యారెక్టర్స్
ప్రభాస్ (అమరేంద్ర బాహుబలి ): కతెలివితేటలూ, కష్టపడేతత్వం. ఒకవేళ రేటింగ్స్ ఇవ్వాల్సి వస్తే ముందు వరసలో అమరేంద్ర బాహుబలి ఉంటాడు. కానీ ఆఫీస్‌లో జరిగే రాజకీయాలు సాఫ్ట్ వెర్ డెవలపర్ అమరేంద్ర బాహుబలిని తొక్కేశాయంటూ సరదాగా కామెంట్ చేశారు టెక్కీలు.
రానా (భళ్లాలదేవ): బాహుబలి సినిమాలో విలన్ పాత్రలో కనిపించిన భళ్లాలదేవ… టాలెంట్ ఉంది. కానీ కష్టపడరు. ఉద్యోగులంతా కలిసి వేరే వారిని పొగుడుతుంటే టీం లీడర్ అయ్యేందుకు ఎన్నో కుతంత్రాలు పన్నుతుంటాడు.
దేవసేన:
అందంగా ఉంటారు… ఓ లక్ష్యం కోసం కష్టపడి పనిచేస్తుంటారు…తమ వెనుక ఏం జరుగుతున్నా పెద్దగా పట్టించుకోరు. తమ ప్రమోషన్ కోసం అహర్నిషల్ కష్టపడుతూనే ఉంటారు.
నాజర్ (బిజ్జలదేవా): బిజ్జలదేవను టీమ్ లీడ్ లేదా మేనేజర్‌గా టెక్కీలు డిజైన్ చేశారు. అడుగడుగునా రాజకీయాలు …అర్హత లేకున్న తన వారికోసం ఎందాకైనా రాజకీయాలు చేసేందుకు వెనకడాని మనస్తత్వం బిజ్జలదేవది.
ప్రభాకర్ (కాలకేయ): అందరు జావా, సి, అని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మాట్లాడుతుంటే. “కాలకేయ” మాత్రం ఎవరికీ అర్ధం కానీ భాషలో మాట్లాడుతుంటాడు. పైగా ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకుంటూ ఉంటాడు.
సత్యరాజ్ (కట్టప్ప): సినిమాలో కట్టప్ప ఎలా అయితే రాజ్యం కోసమే అన్నట్లు ఎంతో నమ్మకంగా ఉంటాడో ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి కూడా అంతే నమ్మకంతో వ్యవహరించే వ్యక్తిగా తీర్చిదిద్దారు టెక్కీలు. ఉద్యోగులకు ఆన్‌సైట్‌పై విదేశాలకు వెళ్లే అవకాశం వస్తే వారికి అన్ని విధాల సహాయం చేసే గొప్ప మనస్తత్వం మన సాఫ్ట్వేర్ టెక్కీ కట్టప్పది. కట్టప్పకు ఇతర కంపెనీల నుంచి మంచి ప్యాకేజ్ వచ్చినా తనను నమ్ముకున్న కంపెనీని వదిలి వెళ్లే ప్రసక్తే లేదని చెప్పే క్యారెక్టర్‌గా మలిచారు టెక్కీలు.
రెండో ప్రభాస్ (శివుడు): ఒక అమ్మాయి కోసం సాఫ్ట్ వెర్ కంపెనీలో చేరుతాడు. కానీ అంతలో తన బలం ఏంటో. తన గమ్యం ఏంటో అర్ధం అవుతుంది. ఆ తర్వాత అదే కంపెనీలో ఎంతో నేర్చుకుంటాడు. కొత్త ప్రాజెక్టు తనకు ఎప్పుడు అప్పగిస్తారా అని ఆతురతగా ఎదురు చూసే వ్యక్తిగా డిజైన్ చేశారు టెక్కీలు.
రమ్యకృష్ణ (శివగామి): సాఫ్ట్వేర్ కంపెనీలో శివగామి పాత్ర సీనియర్ టీమ్ లీడర్ లేదా సీనియర్ మేనేజర్. స్వతహాగా దృఢత్వం కలిగిన మనస్తత్వం ఎంతో పట్టుదల కలిగిన మనిషి. ఒక ఉద్యోగికి అప్పజెప్పిన పనిని సకాలంలో పూర్తి చేసి క్లయింట్ల విశ్వాసాన్ని పొందగలిగితే వారిని అన్ని విధాలా ప్రోత్సహించే మనస్తత్వం. అంతకంటే మంచిగా ఫలితాలు చూపిన ఉద్యోగికి మరిన్ని వరాలు ప్రకటించే మనిషిగా శివగామి క్యారెక్టర్‌ను రూపొందించారు.
తమన్నా (అవంతిక): అవంతికది హెచ్ ఆర్ మేనేజర్ క్యారెక్టర్ .అందంగా ఉండే ఈ మేనేజర్ కేవలం ఉద్యోగులను రిక్రూట్ చేసే పాత్రకే పరిమితం చేశారు టెక్కీలు.
మొత్తానికి బాహుబలి క్యారెక్టర్స్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉంటే ఎలాఉంటుందనే అందమైన ఆలోచనకు టెక్కీలు ఊపిరిపోసి ఫోటోలతో సహా పోస్టులు పెట్టడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.