ఉత్త‌రాఖండ్‌లో బాహుబలి 2 అప్పుడే విడుద‌లైంది..! (వీడియో)

వైవిధ్యభ‌రిత చిత్రాల ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి తీసిన బాహుబలి దేశ‌వ్యాప్తంగానే కాదు, ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా ఎంత‌గానో పేరు ప్రఖ్యాతులు సాధించిన విష‌యం విదిత‌మే. అందులో న‌టించిన ప్ర‌భాస్‌, రాణాల‌కైతే అంత‌ర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు కూడా వ‌చ్చింది. ఈ క్ర‌మంలో త్వ‌ర‌లో రానున్న బాహుబ‌లి పార్ట్ 2 పై జనాల్లో ఇప్ప‌టికే విప‌రీత‌మైన క్రేజ్ ఏర్ప‌డింది. ఆ క్రేజ్‌ను కాస్తా త‌న‌కు అనుకూలంగా మార్చాల‌నుకున్నాడు ఆ రాజ‌కీయ నాయ‌కుడు. ఇంకేముంది… రానున్న ఎన్నిక‌ల్లో త‌న‌కే ఓటు వేయాల‌ని, త‌న‌నే సీఎంను చేయాల‌ని జ‌నాల‌కు చెబుతూ ఏకంగా బాహుబ‌లి 2 పేరిట ఓ వీడియోనే క్రియేట్ చేసి యూట్యూబ్‌లో పెట్టాడు. దీంతో ఆ వీడియో ఇప్పుడు నెట్‌లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఇంత‌కీ… ఆ నాయ‌కుడు ఎవ‌రో తెలుసా..?

rawat-bahubali

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత అయిన హరీష్ రావత్ తెలుసు కదా. ఆయ‌న ముఖాన్ని గ్రాఫిక్స్ చేసి బాహుబలి సినిమాలో ప్రభాస్ శివలింగాన్నిఎత్తే సీన్‌లో పెట్టారు. దాంతో చూసే వారికి రావ‌త్ శివ‌లింగాన్ని ఎత్తుతాడేమో అనిపిస్తుంది. కానీ ఆయ‌న ఎత్తుతుంది ఉత్త‌రాఖండ్‌ను. ఎన్నిక‌ల్లో త‌న‌ను గెలిపించి సీఎంను చేయాల‌ని, ఉత్త‌రాఖండ్ ర‌క్ష‌కున్ని తానేన‌ని చెబుతూ రావ‌త్ ఆ వీడియోలో క‌నిపిస్తారు. దాంతోపాటు ఇత‌ర పార్టీల నేత‌ల ముఖాల‌ను కూడా గ్రాఫిక్స్ చేసి అందులో పెట్ట‌డంతో చూసేవారికి ఆ వీడియో మ‌రింత ఫ‌న్నీగా క‌నిపిస్తుంది. కావాలంటే మీరూ ఆ వీడియోను చూడ‌వ‌చ్చు.

త్వ‌ర‌లో రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో భాగంగా ఉత్త‌రాఖండ్‌లో కాంగ్రెస్ పార్టీ అలా వినూత్న ప్రచారాన్ని చేప‌ట్టింది. అయితే ఆ వీడియోకు బాహుబ‌లి 2 అని పేరు పెట్టింది. దీంతో స‌హ‌జంగానే ఆ సినిమా ప‌ట్ల ఉన్న క్రేజ్ ఆ పార్టీకి కూడా ఉపయోగ‌ప‌డుతోంది. ఈ క్ర‌మంలో ఇత‌ర పార్టీల నేత‌లు అక్క‌డి జ‌నాల‌ను ఆక‌ట్టుకునేందుకు మ‌రి ఎలాంటి వీడియోతో వ‌స్తారో..? కొంప‌దీసి కాల‌కేయుని వీడియోతో రారు క‌దా. అలా వస్తే మొదటికే మోసం వ‌స్తుంది..!

Comments

comments

Share this post

scroll to top