క్లాస్ లోనే తాళి కట్టాడు..తల్లి/టీచర్ దగ్గరుండి తాళి కట్టించి వీడియో తీశారు..! అసలేమైంది.?

కొన్ని ఘటనలు చూస్తే ఈ సమాజం ఎటు పోతుంది అనిపిస్తుంది. అలాంటిదే తరగతి గదిలో విధ్యార్దిని కి తాళికట్టిన యువకుడు ఘటన…నిజంగా తప్పు పెద్దవారిదా.. పిల్లలదా..ఈ ఘటన చూస్తే పిల్లలు భరితెగించారనుకోవాలా..పక్కనే ఉన్న పెద్దమనిషెవరో వారిని వారించకుండా దగ్గరుండి మరీ ఈ విధంగా చేసినందుకు పెద్దలదే తప్పనాలా..చదువుకోవాల్సిన వయసులో ప్రేమా ,పెళ్లి అంటూ వెంపర్లాడుతున్న పిల్లల మానసిక పరిస్థితి కారకులెవరూ..ఈ పరిస్థితులకు అంతం ఎప్పుడు ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు…!

ఒకప్పుడు ప్రేమంటే ఒక వయసుకొచ్చాక ఆడ,మగ పుట్టేది..అది కూడా బయటపడడానికి చాలా సమయం పట్టేది..పెద్దలకు తెలిస్తే ఏమంటారో అనే భయం లొలోపల భయపెట్టేది..చాటుమాటుగా కలిసేందుకు కూడా భయపడాల్సొచ్చేది..కానీ ఇప్పుడు ఫోన్లు ,ఛాటింగ్స్ వచ్చాక హద్దులేకుండా పోయింది..అరచేతిలో ప్రపంచం మొత్తాని చూపించేలా స్మార్ట్ ఫోన్స్,అడ్డు చెప్పాల్సిన పెద్దలే దగ్గరుండి మరి పిల్లలకు ఫోన్స్ ఇవ్వడం..పెరిగిపోయిన విచ్చలవిడి తనం వలన రోజుకొక ఘటన వెలుగులోకి వస్తున్నాయి..తాజాగా తరగతి గదిలోనే ఒక అమ్మాయికి తాళి కట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..అది కూడా దగ్గరుండి టీచరో,ఆ పిల్లాడి తల్లో కట్టిస్తున్నారు..తాళి కట్టేప్పుడు ఆ అమ్మాయి వారించకపోగా సిగ్గుపడడం,పక్కనున్న పిల్లలు చప్పట్లు కొట్టడం..తల్లే దగ్గరుండి వీడియో తీస్తూ తాళి కట్టమని చెప్పడం..ఇవన్నీ దేనికి సంకేతం.. తల్లా,టీచరా అని ఇంకా తెలియలేదు..ఘటనకు సంభందించిన వివరాలు తెలియలేదు.

వీడియోలో ఉన్న మాటలను బట్టి ఈ ఘటన తమిళనాడులో జరిగినట్టు తెలుస్తోంది.  వీడియో వైరల్ కావడంతో స్పందించిన బాలల హక్కుల  సంరక్షణ  సంస్థల ప్రతినిధులు, పోలీసులు ఈ జంట కోసం గాలిస్తున్నారు. ఈ వీడియో మొత్తం 29 సెకన్లు ఉంది. ఆ సమయంలో తరగతి గదిలో మరికొంత మంది విద్యార్థులు ఉన్నట్టు వీడియోలో కనిపిస్తోంది. అంటే క్లాసు జరుగుతుండగానే ఈ తంతు జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న విషయం మాత్రం తెలియరాలేదు.

watch video here:

Comments

comments

Share this post

scroll to top