ల‌వ‌ర్స్‌కు బ్యాడ్ న్యూస్‌..”ఇంస్టాగ్రామ్” లో వచ్చిన కొత్త ఫీచర్ తో రిలేషన్ బ్రేక్ అవ్వొచ్చు.! ఎందుకంటే?

ఫేస్‌బుక్‌.. మెసెంజ‌ర్‌.. వాట్సాప్‌.. వీటిల్లో మ‌నం ఏ యాప్‌ను వాడినా.. అందులో మ‌నం యాక్టివ్‌గా ఉన్నామో లేదో ఇత‌రుల‌కు ఇట్టే తెలిసిపోతుంది. అలాగే ఇత‌రులు యాక్టివ్‌గా ఉన్నారో లేదో మ‌న‌కు తెలుస్తుంది. దాన్ని సూచించే విధంగా స‌ద‌రు యూజ‌ర్ పేరు పక్క‌నే యాక్టివ్ అని చూపిస్తే గ్రీన్ చుక్క ఒక‌టి మ‌న‌కు క‌న‌బ‌డుతుంది. దీంతో అవ‌త‌లి వారు యాక్టివ్‌గా ఉన్నార‌నుకుని మ‌నం వారితో చాటింగ్ చేస్తాం. అయితే ఫేస్‌బుక్‌కు చెందిన ఇన్‌స్టాగ్రాం యాప్‌లో మాత్రం ఇలాంటి ఫీచ‌ర్ ఇప్ప‌టి వ‌ర‌కు లేదు. దీంతో చాలా మంది ప్రేమికులు దీన్ని వాడ‌డం మొద‌లు పెట్టారు. అయితే ఇప్పుడు వారికి షాకింగ్ న్యూస్‌. ఎందుకుంటే.. ఇక‌పై ఇన్‌స్టాగ్రాం లో కూడా యాక్టివ్ ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌చ్చింది. దీంతో ఆ యాప్‌లోనూ ఇప్పుడు యాక్టివ్‌గా ఉన్న యూజ‌ర్ల గురించి తెలుసుకోవ‌చ్చు.

ఇన్‌స్టాగ్రాంలో తాజాగా అందుబాటులోకి వ‌చ్చిన ఫీచ‌ర్ వ‌ల్ల అవ‌త‌లి యూజ‌ర్ ఆ యాప్‌లో యాక్టివ్‌గా ఉన్నాడో లేదో తెలుసుకోవ‌చ్చు. అందుకు గాను ఇన్‌స్టాగ్రాం యాప్‌లో ఉండే మెసేజ్ బాక్స్‌లోకి వెళ్లాలి. అందులో క‌నిపించే యూజ‌ర్ల వ‌ద్ద యాక్టివ్ అని క‌నిపిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇన్‌స్టాగ్రాంలో ఈ ఫీచర్ లేదు. కానీ దీన్ని తాజాగా అందుబాటులోకి తెచ్చారు. అయితే ఇన్‌స్టాగ్రాంలో కొత్త‌గా వ‌చ్చిన ఈ ఫీచ‌ర్ మాత్రం యూజ‌ర్ల‌కు న‌చ్చ‌డం లేదు. మ‌నం యాక్టివ్‌గా ఉన్నామో లేదో అవ‌త‌లి వారికి ఎందుకు తెలియ‌ప‌ర‌చ‌డం, అది అవ‌స‌రం లేదు.. అస‌లు ఆ ఫీచ‌ర్ ఉంటే మ‌న ప్రైవ‌సీకి ఇబ్బంది క‌లుగుతుంది.. ఇన్‌స్టాగ్రాం.. మీరు కూడా అలా చేస్తే ఎలా.. మీరు ఫేస్‌బుక్‌, వాట్సాప్ బాట ప‌ట్ట‌కండి.. అంటూ ఇన్‌స్టాగ్రాం యూజ‌ర్లు ఈ ఫీచ‌ర్‌కు వ్య‌తిరేకంగా కామెంట్లు పెడుతున్నారు.

అయితే ఇన్‌స్టాగ్రాంలో వచ్చిన ఈ యాక్టివ్ ఫీచ‌ర్ మీకు న‌చ్చ‌క‌పోతే దాన్ని మీరు డిజేబుల్ చేసుకోవ‌చ్చు. ఎలాగంటే… ఇన్‌స్టాగ్రాం యాప్‌లో కుడి వైపు పై భాగంలో మూల‌కు ఉండే ఆప్ష‌న్స్ ను ఎంచుకుని అందులో కింద‌కు స్క్రోల్ చేయాలి. కింది భాగంలో క‌నిపించే యాక్టివిటీ స్టేట‌స్ అనే బ‌ట‌న్‌ను అన్‌చెక్ చేస్తే చాలు, దాంతో మీరు ఇన్‌స్టాగ్రాంలో ఉన్నప్ప‌టికీ మీరు యాక్టివ్‌గా ఉన్నారో, లేదోనన్న విష‌యం అవ‌త‌లి వారికి తెలియ‌దు. ఇలా మీరు ఇన్‌స్టాగ్రామంలో మీ యాక్టివ్ స్టేట‌స్‌ను గోప్యంగా ఉంచుకోవ‌చ్చు..!

Comments

comments

Share this post

scroll to top