జూన్ టు జులై తెలుగు సినిమాల దండయాత్ర!!

 

SERIAL MOVIES IN JULY

నాలుగు భారీ సినిమాలు, వరుసగా థియేటర్స్ లోకి దూసుకు రానున్నాయి. ఒకదానిని మించి మరోకటి బాక్స్ ఆఫీస్ రికార్డ్ లను బ్రేక్ చేయాలని తహతహలాడుతున్నాయి. టాలీవుడ్ అంటేనే సినిమాలే సినిమాలు, మరే సినీ ఇండస్ట్రీ కూడా రిలీజ్ చేయలేనన్ని సినిమాలు మన ఇండస్ట్రీ నుండి  విడుదల అవుతుంటాయి.  ఈ సమ్మర్ లో భారీ సినిమాలు కాస్త మందగించిన జూన్ టు జులై మధ్య నాలుగు అతి భారీ చిత్రాలు వాటి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం.

రుద్రమదేవి.

గుణ శేఖర్ తన సర్వస్వాన్ని పణంగా పెట్టి తెరకెక్కించిన చిత్రం రుద్రమదేవి, అనుష్క   ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం జూన్ 26న విడుదల కానుంది. ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ నటించడం మరో అధనపు ఆకర్షణ.

కిక్-2

రవితేజ హీరోగా సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం జులై 3న విడుదల కానుంది. రవితేజ కు ఈ మధ్యకాలంలో అంతగా విజయాన్ని సాధించి పెట్టిన సినిమాలేమీ లేకపోవడం. కిక్ పేరుతో రిలీజైన సూపర్ హిట్ సాధించిన సినిమా కు కొనసాగింపుగా కిక్-2 తీయడంతో దీని పై రవితేజ తో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి భారీ అంచనాలను రవితేజ  అందుకుంటాడా లేదా అని తేలాలంటే జులై 3 వరకు ఆగాల్సిందే.

బాహుబలి.

విడుదలకు ముందే ఇంతగా ప్రచారం పొందిన సినిమా తెలుగు సినీ ఇండస్ట్రీ లో మరోటి లేదనే చెప్పాలి.ఈ సినిమాను జక్కన చాలా జాగ్రత్తగా చెక్కాడు. ప్రభాస్,రానా,అనుష్క,తమన్న లతో కలిసి చేసిన అతి పెద్ద బడ్జెట్ సినిమా ఇది. పోస్టర్ల దగ్గరి నుండి ఆడియో రిలీజ్ వరకు బాహుబలి సరికొత్త ట్రెండ్ ను సెట్ చేసింది. అటువంటి బాహుబలి జులై 10 న విడుదల కాబోతుంది.

శ్రీమంతుడు.

హ్యాట్రిక్ పరాజయాల తర్వాత మహేష్ బాబు కోలుకోవడానికి కొంత సమయం తీసుకున్నాడు. ఈ సారి పక్కా క్లాస్ స్టోరీతో రంగంలోకి దిగాడు. కొరటాల శివ డైరెక్షన్ లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా జులై 17 న థియేటర్స్ లోకి రానుంది.

 

All The Best: RudramaDevi, Kick-2, BahuBali, Sreemantudu.

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top