బిడ్డ స్పర్శ తగలగానే కోమా నుండి బయటకు వచ్చిన ఆ తల్లి..Intresting.!

బిడ్డ స్పర్శ తగిలితే తల్లి మురిసిపోతుంది, కానీ కోమా లో ఉన్న తల్లికి బిడ్డ స్పర్శ రాగానే మెళుకువలోకి వచ్చింది.నమ్మశక్యం కాకున్నా, నమ్మాల్సి ఉంది, ఎందుకంటె ఈ సంఘటన ఇటీవలే బ్రెజిల్ లో చోటు చేసుకుంది. ఈ సంఘటన బ్రెజిల్‌‌లోని ఫోర్టాలెజా ప్రాంత్రం లో జరిగింది అమండా డిసిల్వా(28) అనే ఆమె నిండు గర్భిణి.అయితే ఆమె కోమాలో ఉన్న కారణంగా సిజేరియన్ ఆపరేషన్ చేయాల్సివచ్చింది. రెండు వారాలపాటు కోమాలో ఉన్న ఆమెకు తన పిల్లవాడి స్పర్శ తాకగానే స్పృహ వచ్చింది.మూర్ఛవ్యాధితో బాధపడుతున్న అమండాకు అప్పటికే ముగ్గురు పిల్లలున్నారు. నిండుగర్భిణి అయ్యున ఆమె కోమాలోకి వెళ్ళింది. దీంతో వైద్యులు ఆమెకు సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీయాల్సి వచ్చింది.

కానీ అప్పుడే పుట్టిన ఆ శిశువు బరువు రెండు కిలోలే ఉంది. దీంతో వైద్యులు ఆ శిశువుకు ప్రత్యేక వైద్యం అందించారు. ఆ తరువాత ఆ ఆసుపత్రిలో పనిచేసే నర్సు ఫెబియోలా మాట్లాడుతూ ఆ శిశువుకు ప్రేత్యేక వైద్యం అందించాము. కోలుకున్న ఆ శిశువును తల్లి ఛాతీపై ఉంచిన కొద్దిసేపటికి ఆమెకు స్పృహ వచ్చిందని తెలిపింది. ఆ తరువాత ఆ శిశువు తల్లి అమండా మాట్లాడుతూ తనకు డెలివరీ ఎలా జరిగిందో తెలియలేదని, తన చిన్నారిని తాకగానే స్పృహలోకి రావటం విచిత్రంగా అనిపిస్తోందని చెప్పింది.

ఇలాంటి సంఘటనలు జరగడం చాలా అరుదు, సినిమాల్లో మాత్రమే ఇలాంటివి జరుగుతుంటాయి అనుకొనే వాలు నిజ జీవితం లో కూడా ఇలాంటివి జరుగుతాయి అని ఆశ్చర్య పోతున్నారు, కోమా లోకి వెళ్తే ఎప్పుడు బయటికి వస్తామో తెలియదు, అసలు బ్రతుతామో లేదో కూడా తెలియుడు కోమా లోకి వెళ్తే, అలాంటిది బిడ్డ స్పర్శ ద్వారా బ్రతకడం అంటే వింత అనే చెప్పాలి, పిల్లలు దేవుళ్లతో సమానం అని చాలా మంది అంటూ ఉంటారు, ఆ దేవుడే ఆ పిల్లవాడి రూపం లో వచ్చి ఆ తల్లి ప్రాణాన్ని నిలబెట్టాడు అని నెటిజెన్ లు కమెంట్స్ చేస్తున్నారు. శిశువుకి, తల్లికి ప్రస్తుతం ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, ఇద్దరూ ఆరోగ్యాంగా ఉన్నారని డాక్టర్ లు తెలిపారు.

Comments

comments

Share this post

scroll to top