“ఓయ్”తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన “బేబీ షామిలి”…ఇప్పుడు ఏ యంగ్ హీరోతో రీఎంట్రీ ఇస్తుందో తెలుసా.?

అంజలి అంజలి అంజలి మెరిసే పున్నమి వెన్నెల జాబిలి… బేబి షామిలి అంటే గుర్తుపట్టనివారు కూడా అంజలి పాప అనగానే టక్కున గుర్తుపట్టేస్తారు.బాలనటిగా దక్షిణాది భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన బేబిషామిలి..ఆ తర్వాత హీరోయిన్ గానూ తెరంగేట్రం చేసింది.అనుకున్నంత గుర్తింపు రాకపోవడంతో వెనుదిరిగింది.ఇప్పుడు మళ్లీ నాగశౌర్యతో జంటగా హల్ చల్ చేయడానికి రెడి అయిపోయింది…

షామిలికి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా ‘అంజలి’ . ఈ సినిమాకు గాను షామిలికి 1990 లో భారత జాతీయ చలనచిత్ర పురస్కారం కూడా అందుకుంది.. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించినప్పటికి హీరోయిన్ గా సరైన అవకాశాలే రాలేదు.. సిద్దార్ద్ తో ఓయ్ అనే సినిమాలో నటించింది.ఆ సినిమా రిలీజ్ కి ముందు ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.కానీ సినిమాలో షామిలిని చూసాక పెదవి విరిచేశారు.ఆ తర్వాత చాలాకాలం వరకు మరే సినిమాలో కనపడలేదు.ఇన్నేళ్లకు అమ్మమ్మ గారిల్లు సినిమాలో నాగశౌర్య సరసన నటించింది.

ఛలో సినిమా రిలీజ్ అయి హిట్ అవ్వడంతో జోష్ లో ఉన్నాడు నాగశౌర్య.ఇప్పుడు అమ్మమ్మ గారిల్లు కూడా మంచి హిట్ కొడుతుందని కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు.ప్రేమికుల రోజు సంధర్బంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.ఇందులో శామిలి ఓయ్ సినిమా టైంలో అప్పటికంటే కూడా చాలా అందంగా,కొంచెం నాజుకుగా అయినట్టు కనపడుతుంది. నాగశౌర్య లక్ కలిసొచ్చి ఈ సినిమా అయినా  షామిలికి మంచి బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి..

Comments

comments

Share this post

scroll to top