త‌ల్లి చ‌నిపోయింద‌ని విప‌రీతంగా దుఃఖించిన పిల్ల వాన‌రం..! (Watch Video)

సృష్టిలో ఏ జీవికైనా త‌ల్లి త‌ల్లే..! త‌ల్లి ప‌ట్ల పిల్ల‌ల‌కు, పిల్ల‌ల ప‌ట్ల త‌ల్లికి అమిత‌మైన ప్రేమానురాగాలు ఉంటాయి. కేవ‌లం మ‌నుషులే కాదు, ప‌క్షులు, జంతువులు ఇలా వేటిని తీసుకున్నా త‌ల్లి, పిల్ల‌ల మ‌ధ్య అంతులేని ఆప్యాయ‌త‌, అనురాగం ఉంటాయి. అలాంటి అనురాగం పెంచుకుందో ఏమో గానీ ఆ వానరం పిల్ల త‌న త‌ల్లి చ‌నిపోతే విప‌రీతంగా ఏడ్చేసింది. నువ్వు లేక పోతే ఇక నేను ఎలా జీవించేది… అన్న విష‌యాన్ని త‌ల‌పించేలా ఆ వాన‌రం పిల్ల ఏడ్చిందంటే మీరు న‌మ్మ‌గ‌ల‌రా..?  మీరే కాదు, జ‌రిగిన సంఘ‌ట‌న చూస్తే త‌ప్ప ఎవ‌రూ న‌మ్మ‌లేరు..!


అది తమిళ‌నాడు రాష్ట్రం నుంచి క‌ర్ణాట‌క‌కు వెళ్లే జాతీయ ర‌హ‌దారి. దానికి ఆనుకుని ఉన్న ఎలంతూర్ అనే ఓ గ్రామం వ‌ద్ద ఓ కోతి రోడ్డు దాటుతోంది. ఈ క్ర‌మంలో ఆ హైవే మీదుగా వ‌చ్చిన ఓ కారు ఆ కోతిని బ‌లంగా ఢీకొట్టింది. దీంతో ఆ వాన‌రం అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయింది. దాన్ని చూసిన పిల్ల వాన‌రం వెంట‌నే ప‌రిగెత్తుకుని వ‌చ్చి త‌న త‌ల్లిపై ప‌డి ఏడ్చేసింది. మొద‌ట త‌న త‌ల్లి బ‌తికే ఉంది కాబోల‌నుకుని ఓసారి క‌దిపి చూసింది. అయితే ఆ కోతి క‌ద‌ల‌క‌పోవ‌డంతో దాని పిల్ల దానిపై ప‌డి విప‌రీతంగా ఏడ్చింది.


కావాలంటే ఆ పిల్ల వాన‌రం ఏడుస్తున్న వీడియోను మీరూ చూడ‌వ‌చ్చు. ర‌హ‌దారి ప‌క్క‌న వెళ్తున్న ఓ వ్య‌క్తి ఈ దృశ్యాల‌ను వీడియో తీయ‌గా ఇప్పుడ‌వి నెట్‌లో ట్రెండ్ అవుతున్నాయి. అయితే అలా ఆ కోతి మ‌ర‌ణించ‌గానే స‌మీపంలో ఉన్న గ్రామ‌స్తులు ఆ కోతి నుంచి పిల్ల‌ను విడ‌దీసి శాస్త్రోక్తంగా ద‌హ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించార‌ట‌. ఈ క్ర‌మంలో ఆ పిల్ల వానరం బాధ‌ను చూసి ప‌లువురు కంట త‌డి కూడా పెట్టార‌ట‌. అంతేగా మ‌రి.. త‌ల్లి చ‌నిపోతే పిల్ల‌ల‌కేగా ఆ బాధ తెలిసేది..!

Comments

comments

Share this post

scroll to top