పూడ్చిన 3 రోజులకు..ఆ పసికందు బతికాడు..! అసలు కథ తెలుస్తే నోరెళ్లబెడతారు..!

కన్న తల్లి అంటే పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది అని తెలుసు..! అందుకే అమ్మను మించిన దైవం లేదు అని అంటుంటాము. కానీ అలాంటి కన్న తల్లే పుట్టిన పసికందును పూడ్చిపెట్టింది. పుట్టిన వెంటనే పూడ్చి పెట్టింది.. కానీ అదృష్టం కొద్దీ ఆ చిన్నారి బతికే ఉన్నాడు. పూడ్చిన మూడు రోజుల తరవాత ఆ పసికందు బతికాడు. వివరాలు మీరే చూడండి!

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఓ యువతి.. పేరెంట్స్ కు తెలిస్తే ఆగ్రహిస్తారని పుట్టిన వెంటనే శిశువును పూడ్చిపెట్టింది. దక్షిణాఫ్రికాలోని క్వాజులు, నాటల్ ప్రావిన్స్ లో ఈ సంఘటన జరిగింది.

ఆ యువతికి 25 ఏళ్లు. టింబర్ ఫ్యాక్టరీ లో బాలుడిని సజీవంగా పూడ్చిపెట్టింది. 3 రోజుల తర్వాత .. ఆ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్లకు పిల్లాడి ఏడ్పు వినబడింది. అనుమానం వచ్చి చూడగా.. ఆ బాలుడు బతికే ఉన్నాడు. ఇలాంటి సిగ్గుచేటు పని చేసినట్టు తల్లితండ్రులకి తెలియకూడదని ఇలాంటి పాపానికి ఒడికట్టింది ఆ యువతి. కన్న కొడుకు అని కూడా చూడకుండా పూడ్చిపెట్టా అని ఒప్పుకుంది.

ఫ్యాక్టరీలో దొరికిన కలప ముక్కలతో పాటు కొంత ఇసుకకప్పి బాలుడిని పూడ్చివేసిందా తల్లి. మూడు రోజుల తర్వాత ఆ శిశువు ఏడుపులు వినిపిస్తుండటంతో పోలీసులకు సమాచారం అందించారు సిబ్బంది. పోలీసులు ఆ బాలున్ని కాపాడారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఈ దుశ్యర్యకు పాల్పడిన తల్లిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

Comments

comments

Share this post

scroll to top