బాబు గోగినేని చేతిలో మరొకరు బలి..చనిపోయిన వారిని బతికిస్తాను అన్నందుకు హైలైట్ కౌంటర్!

ఒకటి ..రెండు..మూడు వికెట్లు ఫట్.. ఏ మ్యాచ్..ఇన్ని వికెట్లు తీసిన బౌలర్ ఎవరూ..ఔట్ అయిన బ్యాట్స్ మెన్ ఎవరూ అని తెగ ఆలోచిస్తున్నారా..వరుస వికెట్లు గాలి డాక్టర్,వేణు స్వామి..ఇప్పుడు ఇంకొకరు..బౌలర్ బాబు గోగినేని ప్రముఖ హేతువాది.. మొన్నీ మధ్య ఒక టివి ఛానెల్లో  పెట్టిన ప్రాణ చికిత్స అనే పేరుతో ఒక ఫోన్ కాల్ లోనే రోగం నయం చేసే అతనికి గట్టి కౌంటర్‌ ఇచ్చారు. తర్వాత వేణు అనే ఆస్ట్రాలజిస్ట్  గుట్టు విప్పాడు..తప్పుడు జ్యోతిష్యాలు నమ్మి ప్రజలు ఎలా మోసం పోతున్నారో..లైవ్ లో నే బట్టబయలు చేశాడు..ఇప్పుడు కాలజ్ణానం గురించి జరుగుతున్న చర్చలను తిప్పికొట్టారు బాబు గోగినేని..

పోతులూరి వీరబ్రహ్మస్వామి 17వ శతాబ్దములో కాలజ్ఞాన తత్వాలను బోధించారు..ఈయన యోగి ,హేతువాది ,సంఘ సంస్కర్త.  బ్రహ్మం గారు తన కాలజ్ఞానములో భవిష్యత్ గురించి ఎన్నో విషయాలు చెప్పారు.వాటిల్లో కొన్ని  విషయాలు నిజమయ్యాయి. తీర్థ యాత్రలు చేస్తున్నటువంటి విశ్వబ్రాహ్మణ పుణ్యదంపతులు పరిపూర్ణయాచార్యులు, ప్రకృతాంబలకు కాశీ పట్టణంలో జన్మించి,కర్ణాటక రాష్ట్రం, స్కందగిరి పర్వతసానువులో స్థితమైన పాపాగ్ని మఠ (ప్రస్తుతం ఇది చిక్‌బళ్లాపూర్ జిల్లా లోని కళవారహళ్లిలో ఉన్నది) అధిపతులు వీరభోజయాచార్య, వీరపాపమాంబలవద్ద పెరిగిన శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి, కడప లోని కందిమల్లాయపల్లిలో చాలాకాలం నివసించి సజీవ సమాధి పొందారు.  వీరబ్రహ్మము వలన ప్రసిధ్ది పొందుట చేత కందిమల్లాయపల్లె తర్వాతి కాలములో  బ్రహ్మంగారి మఠంగా ప్రసిద్ధి చెందింది.ప్రపంచంలో ఏ వింత జరిగిన ఇది బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం కాలజ్ణానం గురించి,బ్రహ్మంగారి మఠం గురించి…పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారసత్వం గురించిన చర్చ జరుగుతుంది..

ఈ చర్చలో భాగంగా ఏర్పాటు చేసిన లైవ్ లో పాల్గొన్నారు బాబు గోగినేని .అందులో అనేక అంశాలు చర్చిస్తుండగా మధ్యలో చనిపోయిన వారిని బతికిస్తాం అంటూ వచ్చిన మాటలకు బాబు గోగినేని అడ్డుపడి గాంధిని పుట్టించండి ..మా ఇంట్లో కూడా చాలామంది చనిపోయాారు బతికించండి అంటూ తన వాదన వినిపించారు..ఆ చర్చ మీరే చూడండి..

watch video here:

Comments

comments

Share this post

scroll to top