ఏనుగు తొక్కినా ఆ గుడ్డు పగలదు అన్నాడు…వెంటనే “బాబు గోగినేని” చేసిన పనికి వారికి దిమ్మతిరిగిపోయింది!

మళ్లీ వచ్చేశారు బాబు గోగినేనిగారూ.. నిజంగా రిలీజ్ మూవికి కూడా ఇంత క్రేజ్ ఉండదు..అంత కిక్ తో క్లిక్ అవుతున్నాయ్  న్యూస్ ఛానెల్స్ లో వచ్చే గోగినేని లైవ్ షోలు..ఒక్కొక్కరిగా లైవ్ షోలలో వికెట్లు పడుతుంటే ఇంట్రస్ట్ గా చూడడం..నెక్స్ట్ ఎవరో అని ఆసక్తిగా ఎదురు చూడ్డం తెలుగు ప్రేక్షకుడి వంతు అవుతుంది..గాలి డాక్టర్ పాయే..దొంగ జ్యోతిష్యుడు పాయే..కాలజ్ణాన మహిమలు పాయే..ఇప్పుడు కోడిగుడ్డు పగిలిపాయే..అదేంటి గుడ్డు పగలడం ఏంటి అనుకుంటున్నారా…అదే చూద్దాం..

ఇటీవల కోడి పందేల గురించి ఒక న్యూస్ ఛానెల్ లైవ్ డిబేట్ పెట్టింది..అందులో భాగంగా వచ్చిన అంశమే ఏనుగు అడుగు పెట్టినా కూడా గుడ్డు పగలదు అని లైవ్ షోలో పెద్దలు సెలవిస్తే..సరే నండి నేను అడుగు పెడతాను అని బాబు గోగినేని ఆ సవాల్ స్వీకరించారు..వారు చెప్పినవిధంగానే గుడ్డు నిలువుగా పెట్టారు,కుడికాలు చెప్పు తీసేసి అడుగు వేసారు..గుడ్డు పగిలింది.. టెస్ట్ కి వెళ్లేముందు కూడా బాబు గోగినేని అన్ని ప్రశ్నలు అడిగే వెళ్తే ,చివరాకరికి ఆ పెద్ద మనిషి ఇది నాటు కోడి గుడ్డు కాదు పగిలింది అని సెలవిచ్చారు..ఓడిపోయాక తొండి చేయడం చిన్నప్పటి నుండి చూస్తునే ఉన్నాం కానీ లైవ్ షో లో కూడా తూచ్ అంటే ఎలా అండీ… ఒక సారి ఆ లైవ్ షో మీరే చూడండి…

watch video here:

నిజంగా మనం ఎలాంటి వ్యవస్థలో బతుకుతున్నామనేది ఈ లైవ్ షోలు చూస్తుంటే తెలుస్తుంది..సరే దేవుడున్నాడు,ఏదో శక్తి నడిపిస్తుంది అని ఎవరి నమ్మకాలు వారివి అని వదిలేద్దామంటే జ్యోతిష్యం పేరిట వ్యాపారం..ఇలాంటి పిచ్చినమ్మకాలతో మనుషుల్ని పిచ్చివారిగా చేయడం ఎంత వరకు కరెక్ట్..

Comments

comments

Share this post

scroll to top