అన్యాయంగా చిన్నారిని నరబలిచ్చినందుకు “బాబు గోగినేని” రియాక్షన్…ఇదిగో నా వెంట్రుక, చేతబడి చేయండి.!

అంతరిక్షంలోకి వెళ్తున్న ఈ కాలంలో ఇంకా చేతబడులు ,నరబలులు అంటూ ఇటీవల కాలంలో జరిగిన చిన్నారి హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది..భార్య ఆరోగ్యం బాగుపడడం కోసం చంద్రగ్రహణం రోజున చిన్నారి తలను బలి ఇవ్వాలని మంత్రగాళ్లు చెప్పినందుకు  ,నగ్నంగా పూజలు చేసి పాపని బలి ఇచ్చిన వైనం పోలీసులనే కాదు,యావత్ ప్రజానికాన్ని నివ్వెరపోయేలా చేసింది.ఏ కాలంలో ఉన్నాం మనం..సైన్సుకు అంతుచిక్కనిదంటూ లేని ఈ రోజుల్లో,ఇంతమంది డాక్టర్లుండగా ఆరోగ్యం కోసం పాపను బలివ్వడం ఏంటి..ఇదే విషయంపైన ఒక న్యూస్ ఛానెల్ డిబేట్ నిర్వహించింది.

ఇప్పటివరకూ ఎందరి గుట్టో రట్టు చేసిన బాబు గోగినేని తాజాగా దమ్ముంటే నాకు చేయండి చేతబడి అంటూ వ్యాఖ్యలు చేశారు.ఆ న్యూస్ ఛానెల్లో ప్రముఖ హేతువాది బాబుగోగినేని,జనవిజ్ణాన వేదిక నాయకులు రమేష్ పాల్గొన్నారు.అందులో బాబు గోగినేని మాట్లాడుతూ.. ప్రతి పనికి ముహుర్తాలంటూ ప్రజల్ని మూఢనమ్మకాల దిశగా తీసుకెళ్తున్నారు.ఈ మూఢనమ్మకాల ఫలితంగా ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు.గ్రామాలలో సరైన అవగాహన లేక చేతబడి,బాణామతి పేరిట పేదవారిని మరింత అజ్ణానులను చేస్తున్నారంటూ మండి పడ్డారు..నా వెంట్రుక తీసుకోండి..కావాలంటే గోర్లు కూడా ఇస్తానంటూ.. దమ్ముంటే చేతబడి చేయండి అని ఓపెన్ సవాల్ విసిరారు..ఆ వీడియో మీరే చూడండి..

watch video here:

Comments

comments

Share this post

scroll to top