బాబు గోగినేని పైన విరుచుకుపడ్డ కౌశల్ భార్య.! అసలేం జరిగిందంటే.?

బిగ్ బాస్ షో లో పార్టిసిపేట్ చేయకముందు, బాబు గోగినేని కి విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది, ఎప్పుడైతే గాలి వైద్య డాక్టర్ ని లైవ్ లో బుక్ చేసాడో, అప్పటి నుండి గోగినేని గారు బాగా ఫేమస్ అయ్యారు, కానీ బిగ్ బాస్ లోకి వెళ్ళాక బిస్కిట్ అయ్యారు, ఆయన క్రేజ్ అమాంతం తగ్గిపోయింది, నాస్తికుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆయన, బిగ్ బాస్ కి వెళ్ళాక వేరే పేరు సంపాదించుకున్నాడు.

బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన నాటి నుండి కౌశల్ పైన ఆరోపణలు చేస్తూనే ఉన్నాడు బాబు గోగినేని, కౌశల్ ఆర్మీ కౌశల్ ఏ సృష్టించాడని, ఇదంతా కుట్ర అని ఆయన ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల ఒక డిబేట్ లో బాబు గోగినేని, కౌశల్, నీలిమ కౌశల్ ( కౌశల్ భార్య) పాల్గొన్నారు.

ఆ డిబేట్ లో కౌశల్ పైన బాబు గోగినేని చేసిన ఆరోపణలకు నీలిమ కౌశల్ స్పందిస్తూ సమాధానం ఇచ్చారు. బహుశా బాబు గోగినేని గారికి సోషల్ మీడియా అంటే అవగాహన లేకపోయి ఉండొచ్చు, ఒకరు కాదు ఇద్దరు కాదు వేళల్లో ఫాలోయర్స్ ఉన్నారు కౌశల్ కి సోషల్ మీడియాలో, వేళల్లో అతని పేరు మీద ఫ్యాన్ అకౌంట్స్ ఉన్నాయ్, అంత మందికి డబ్బులు ఇవ్వలేం కదా అని ఆమె తెలిపారు, బిగ్ బాస్ కి వెళ్లక ముందు నుంచే కౌశల్ ఆర్మీ సృష్టించుకున్నారు బంధువుల సాయం తో నా దెగ్గర ఆధారాలు ఉన్నాయ్ అని బాబు గోగినేని గారు చేబుతున్న మాటల్లో వాస్తవం లేదని నీలిమ కౌశల్ తెలిపారు, డబ్బులు ఇచ్చినట్టు రుజువులు చూపీమని, ఆధారాలు చూపికుండా, నిరూపించకుండా ఊరికే మాట్లాడటం తగదని నీలిమ కౌశల్ చెప్పారు.

బిగ్ బాస్ అయిపోయి ఇన్ని రోజులు అవుతున్నా, నిత్యం ఏదో ఒకటి బిగ్ బాస్ కి సంబంధించిన విషయం వార్తల్లో వస్తూనే ఉంది. రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని డిబేట్ లు జరగనున్నాయో ఈ బిగ్ బాస్ మీద.

Comments

comments

Share this post

scroll to top