కష్టాలు తీర్చుతాడాని సాష్టాంగ నమస్కారం చేద్దామని స్వామీజి వద్దకు వెళితే భక్తురాలి శీలాన్నే దోచుకున్నారు కామ స్వాములు.. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ సమీపంలోని నంగలీ అనే గ్రామంలో జరిగింది.స్వాములపై ఉన్న మన నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని దొంగ స్వాములు రెచ్చిపోతున్నారు. ధన మన ప్రాణాలను సైతం కబలిస్తున్నారు.
ఈ దుర్ఘటన వివరాల్లోకి వెళితే…..
ఢిల్లీలోని దరియాగంజ్కు చెందిన ఒక ఇంజినీర్ తన భార్యతో కలిసి వారం రోజుల క్రితం ఓ మతపరమైన కార్యక్రమానికి ఆశ్రమానికి వెళ్లాడు. పూజా కార్యక్రమాల అనంతరం తమ వెంట రావాల్సిందిగా ఇద్దరు సాధువులు కోరారనీ, ఈ కార్యక్రమాలు అయ్యాక తిరిగి వెళ్తుండగా సదరు మహిళ భర్తను నిర్బంధించి అతని భార్య పై అత్యాచారం చేశారట. ఇదే విషయమై బాధితులరాలు పోలీసులకు పిర్యాదు చేసింది.