పతంజలి ప్రొడక్ట్స్ తో…దేశంలోనే టాప్ కోటీశ్వరుల్లో ఒకడిగా ఎదిగిన బాలకృష్ణ..!

బాబా రాం దేవ్‌… ఈయన పేరు చెబితేనే మ‌నకు ఠ‌క్కున గుర్తుకు వచ్చేది యోగా… అలాగే ప‌తంజ‌లి… ఈ పేరు విన్నా మ‌న‌కు బాబా రాందేవ్, ఆయుర్వేదిక్ ఉత్పత్తులు, ఔష‌ధాలు గుర్తుకు వ‌స్తాయి. అంతగా ఆ పేర్లు మ‌న‌కు గుర్తుండిపోయాయి. అందుకు కార‌ణాలు ఏమున్నా జ‌నాల్లో ఇప్పుడు ఆయుర్వేద ఉత్ప‌త్తుల ప‌ట్ల ఆస‌క్తి పెర‌గ‌డ‌మే ఒక ప్ర‌ధాన అంశంగా చెప్పుకోవ‌చ్చు. అయితే నిజంగా మీకు తెలుసా..? ప‌తంజ‌లి ఉత్పత్తుల త‌యారీ కంపెనీలో బాబా రాం దేవ్‌కు ఎలాంటి వాటా లేద‌ని..? అవును, మీరు విన్న‌ది నిజమే. ప‌తంజ‌లి సంస్థ‌లో బాబా రాం దేవ్‌కు ఎలాంటి వాటా లేదు. మ‌రి ఎందుకు ఆయ‌న ఆ ప్రోడ‌క్ట్స్‌కు ప్రచారం చేస్తున్నార‌నే క‌దా మీ డౌట్‌..? ఆ డౌట్‌నే ఇప్పుడు క్లియ‌ర్ చేసుకుందాం.

baba-ramdev-balakrishna

బాబా రేం దేవ్ యోగా గురువుగా ప్ర‌పంచానికి తెలుసు. అయితే ఆయ‌న ద‌గ్గ‌రే శిష్యుడిగా ప‌నిచేస్తున్న ఆచార్య బాల‌కృష్ణ అనే వ్య‌క్తి బాబా రాం దేవ్‌కు అత్యంత సన్నిహితంగా ఉండేవాడు. ఈ క్ర‌మంలోనే బాల‌కృష్ణ ప‌తంజ‌లి సంస్థ‌ను స్థాపించి దేశీయ ఉత్ప‌త్తుల‌ను, ఆయుర్వేద మందులను విక్ర‌యించ‌డం మొద‌లు పెట్టాడు. విదేశీ వ‌స్తువులు, మందుల వ‌ల్ల మ‌న ప్ర‌జ‌ల‌కు ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయో వివ‌రిస్తూ, స్వదేశీ వ‌స్తువుల‌ను, అందునా త‌క్కువ ధ‌ర‌కే ల‌భిస్తున్న వ‌స్తువుల‌ను వాడాల‌ని బాబా రాం దేవ్ ప‌తంజ‌లి ఉత్ప‌త్తులకు ప్ర‌చారం చేస్తున్నారు. ఆయ‌న వెళ్లిన ప్ర‌తిచోటా, ఆయ‌న ఆశ్ర‌మాలు ఉన్న చోటల్లా ప‌తంజ‌లి ఉత్ప‌త్తుల‌కు ప్ర‌చారం చేస్తున్నారు. అయినా బాబా రాం దేవ్‌కు ఆ సంస్థ‌లో ఎలాంటి వాటా లేదు. ఆచార్య బాల‌కృష్ణ‌కే అందులో 93 శాతం వాటా ఉంది. అంతే కాదు ఆయన ఇప్పుడు మ‌రో 34 కంపెనీల‌కు అధిప‌తిగా, ప‌లు ట్ర‌స్టుల‌కు హెడ్‌గా ఉన్నాడు.

కాగా ప‌తంజ‌లి దెబ్బ‌కు ఎన్నో పేరు మోసిన విదేశీ కంపెనీలు ఖంగు తింటున్నాయి. క్వాలిటీలో ఏమాత్రం రాజీ ప‌డ‌కుండా త‌క్కువ ధ‌ర‌కే స్వదేశంలో త‌యారైన వ‌స్తువుల‌ను అందిస్తుండ‌డం పతంజ‌లికి బాగా క‌లిసొచ్చింది. దీనికి తోడు బాబా రాం దేవ్ ప్ర‌చారం, ఎన్‌డీఏ ప్ర‌భుత్వ ఆగ‌మ‌నంతో ప‌తంజ‌లి ద‌శ తిరిగిపోయింది. ఈ క్ర‌మంలో ఆ కంపెనీ ట‌ర్నోవ‌ర్ కేవ‌లం 4 ఏళ్లలోనే 11 రెట్లు పెరిగింది. 2012లో ప‌తంజ‌లి సంస్థ ఆదాయం రూ.450 కోట్లు ఉండ‌గా, ఇప్పుడ‌ది 5వేల కోట్ల‌కు చేరుకుంది. దీంతోపాటు ప‌తంజ‌లి సంస్థ‌కు ఇప్ప‌టి వ‌ర‌కు రూ.25,600 కోట్ల లాభాలు వ‌చ్చాయ‌ని లెక్క‌లు చెబుతున్నాయి. ఇదంతా ఆచార్య బాల‌కృష్ణ వాటాయేన‌ని అంటున్నారు. కాగా ఈ ఆదాయంతో ఆచార్య బాల‌కృష్ణ ఇప్పుడు దేశంలోని టాప్ కోటీశ్వ‌రుల‌లో ఒక‌రిగా మారిపోయార‌ని ప‌లువురు అంటున్నారు. అయితే ఆ డ‌బ్బునంతా ట్ర‌స్టుల నిర్వ‌హ‌ణ‌కు, ఇత‌ర సామాజిక సేవా కార్య‌క్ర‌మాల‌కే వెచ్చించ‌నున్నార‌ని తెలిసింది. ఒక వేళ అదే జ‌రిగితే అప్పుడు ప‌తంజ‌లి ఆదాయం ఇంకా పెరిగేందుకు అవ‌కాశం ఉంటుంది. ఇంత‌కీ ఈ విష‌యంపై మీ స్పంద‌న ఏమిటి..? మీరూ ప‌తంజ‌లి ఉత్ప‌త్తుల‌నే కొంటున్నారా..? లేదంటే ఇత‌ర కంపెనీల‌కు చెందిన వ‌స్తువుల‌ను వాడుతున్నారా..? ప‌తంజ‌లి ప్ర‌గ‌తిపై మీరేమ‌నుకుంటున్నారో కామెంట్ తెలియ‌జేయండి…

Comments

comments

Share this post

scroll to top