చిన్నారిని చంపేసి కూలర్ లో దాచాడు ఆ 16 ఏళ్ల అబ్బాయి…చివరికి ఏమైందో తెలుస్తే షాక్ అవుతారు.!

పెద్దవారిపై ఏమో గానీ పిల్లలపై మాత్రం సినిమాల ప్రభావం చాలానే ఉంటుందని చెప్పవచ్చు. సినిమాల్లో హీరోలు చేసినట్టుగా రియల్‌ లైఫ్‌లోనూ చేయాలని కొందరు పిల్లలు చూస్తుంటారు. అది మంచా, చెడా అని ఆలోచించరు. అలా ఆలోచించకుండానే పనులు చేస్తారు. దీంతో ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది. అంతే కాదు అలాంటి పనులు స్వతహాగా ఆ పిల్లల జీవితాలనే నాశనం చేస్తాయి. సరిగ్గా ఇలాంటిదే ఓ ఘటన తాజాగా చండీగడ్‌లో జరిగింది. ఇంతకీ అసలు ఏమైందంటే…

చండీగఢ్‌లో ఇంటర్‌ చదువుతున్న ఓ 16 సంవత్సరాల వయస్సున్న బాలుడు ఓ సినిమా చూశాడు. అందులో హీరో కిడ్నాప్‌ చేసి డబ్బులు సంపాదించినట్టుగా తాను కూడా ఎవర్నయినా కిడ్నాప్‌ చేసి సంపాదిస్తే త్వరగా డబ్బులు సంపాదించవచ్చని అనుకున్నాడు. అందులో భాగంగానే తమ ఇంటికి సమీపంలో ఉన్న మరో ఇంట్లోని ఓ 5 ఏళ్ల బాలికకు చాక్లెట్‌ ఇస్తానని ఆశ చూపాడు. దీంతో ఆ బాలిక ఆ బాలుడి ఇంట్లోకి వచ్చింది. అనంతరం ఆమెను బంధించాడు. కిడ్నాప్‌ చేశాడు. తరువాత ఆ పాప ఇంట్లో వాళ్లకు ఫోన్‌ చేశాడు.

తనకు రూ.20 లక్షలు కావాలని, ఈ విషయం పోలీసులకు చెప్పినా, టైముకు డబ్బు అరేంజ్‌ చేయకపోయినా బాలికను చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆ బాలిక కుటుంబ సభ్యులు షాక్‌కు లోనయ్యారు. ఈ క్రమంలో విషయం పోలీసులకు తెలిసింది. వారు ఆ బాలుడి ఫోన్‌ నంబర్‌ ఆధారంగా అతని ఇంటిని ట్రేస్‌ చేశారు. అయితే పోలీసులు తనను పట్టుకునేందుకు వస్తున్నారని తెలుసుకున్న ఆ బాలుడు ఆ బాలికను వాటర్‌ కూలర్‌లో పడేసి ముంచాడు. అనంతరం ఆమెను చంపేశాడు. తరువాత పోలీసులు వచ్చి ఆ బాలున్ని అరెస్టు చేశారు. అయితే అసలిదంతా ఎందుకు చేశావని అడిగితే.. తాను ఓ సినిమా చూశానని, అందులో కిడ్నాప్‌ చేస్తే డబ్బులు బాగా సంపాదించవచ్చని చూపించారని, అందుకే తాను కూడా కిడ్నాప్‌ చేసేందుకు యత్నించానని చెప్పడంతో పోలీసులు ఖంగు తిన్నారు. చూశారుగా.. సినిమాల ప్రభావం పిల్లలపై ఎలా ఉందో..! ఏం చేస్తాం..! మారుతున్న జనరేషన్‌. ఇంకా ఇలాంటి దారుణాలను ఎన్నింటిని చూడాల్సి వస్తుందో కదా..!

Comments

comments

Share this post

scroll to top