“కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసా..?” బాహుబలి -2 స్టోరీ, రివ్యూ & రేటింగ్..!

Movie Title (చిత్రం): బాహుబలి – ది కంక్లూషన్ (Baahubali-2 The Conlusion)

Cast & Crew:

  • నటీనటులు: ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా,రమ్యకృష్ణ, సత్యరాజ్‌.. నాజర్‌ తదితరులు
  • సంగీతం: ఎం.ఎం.కీరవాణి
  • ఛాయాగ్రహణం: సెంథిల్‌కుమార్‌
  • కళ: సాబు సిరిల్‌
  • నిర్మాత: ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ (ఆర్కా మీడియా వర్క్స్‌)
  • దర్శకత్వం: ఎస్‌.ఎస్‌. రాజమౌళి

Story:

అమరేంద్ర బాహుబలి(ప్రభాస్‌)ని రాజమాత శివగామి(రమ్యకృష్ణ) మహారాజుగా ప్రకటిస్తుంది. పట్టాభిషేకానికి సమయం ఉండటంతో దేశ పర్యటనకు బయలుదేరతాడు బాహుబలి. కుంతల రాజ్యానికి చేరుకున్న బాహుబలి ఆ దేశ యువరాణి దేవసేన(అనుష్క)ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెకు దగ్గర కావాలని మాహిష్మతి సామ్రాజ్యానికి కాబోయే చక్రవర్తినన్న విషయాన్ని దాచి ఓ అమాయకుడిలా నటిస్తాడు. కుంతల రాజ్యానికి ఆకస్మికంగా వచ్చిన పడిన ఓ పెను ప్రమాదం నుంచి ఆ రాజ్యాన్ని కాపాడతాడు. ఈలోగా దేవసేన చిత్రపటాన్ని చూసిన భళ్లాలదేవుడు(రానా) ఆమెపై మనసు పడతాడు. ఆమెను సొంతం చేసుకోవడానికి వేసిన ఎత్తుతో కథ కీలక మలుపు తిరుగుతుంది. అనూహ్య పరిణామాలతో దేవసేన మాహిష్మతి సామ్రాజ్యంలోకి అడుగుపెడుతుంది. అప్పుడేం జరిగింది? రాజ్యాన్ని విడిచి బాహుబలి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? పెంచిన చేతులతోనే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? తన తండ్రి మరణానికి కారణమైన భళ్లాలదేవుడిపై మహేంద్ర బాహుబలి(ప్రభాస్‌) ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నదే మిగిలిన కథ.

ALSO READ: >>>”బాహుబలి 2 ” సినిమా చుసిన “జూనియర్ ఎన్టీఆర్” ఏమన్నారో తెలుసా..?<<<

Review:

బాహుబలి -1 కి పది రెట్లు మించిన విసుఅల్స్ బాహుబలి -2 లో చూడొచ్చు. భావోద్వేగాల పరంగా పాత్రలను అంతేస్థాయిలో తీర్చిదిద్దాడు జక్కన్న. ప్రతి సన్నివేశంలోనూ ఏదో ఒక పాత్ర బలంగా కనిపిస్తూ ఉంటుంది. తోలి భాగంలో సీరియస్ గా కనిపించే “కట్టప్ప” కూడా ఈ చిత్రంలో నవ్వులు పండిస్తాడు. కుంతల రాజ్యంలో జరిగే యుద్ధ ఘట్టం ప్రథమార్ధానికే హైలైట్‌గా నిలుస్తుంది. ఇంటర్వెల్ కి  ముందు సినిమాను ఒక స్థాయికి తీసుకెళ్లాడు రాజమౌళి. తర్వాత ఏం జరుగుతుందోనన్న విషయం ప్రేక్షకుడికి తెలుస్తున్నా, దాన్ని ఎంత అందంగా, ఆకట్టుకునేలా ఉంటుందోనన్న ఆసక్తిని రేకెత్తించాడు.  ‘బాహుబలిని కట్టప్పను ఎందుకు చంపాడు’ అనే కీలక ఘట్టాన్ని చాలా బాగా చూపించాడు. రెండోబాహుబలి సాయంతో వారు భల్లాల దేవుని ఎలా ఓడించారు.?మళ్లీ బాహుబలి ఎలా రాజయ్యాడు.? అనేది తెర‌మీద చూడాల్సిందే.

>>>బాహుబలి చూడడానికి బాస్ కు గమ్మత్తైన లీవ్ లెటర్ రాసిన ఉద్యోగి!<<<

Plus Points:

భావోద్వేగాలు
యుద్ధ ఘట్టాలు
విజువల్‌ ఎఫెక్ట్స్‌
బలమైన పాత్రలు
సంగీతం
సినిమాటోగ్రఫీ

Final Verdict:

ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు సినిమాను గర్వించదగ్గ స్థాయికి తీసుకెళ్లిన సినిమా “బాహుబలి”. ప్రతి తెలుగు వాడు తప్పక చూడాల్సిన సినిమా..!

AP2TG Rating: 4.5/5

Trailer:

Comments

comments

Share this post

scroll to top