సినిమా ప్రేక్షకులకు రాజమౌళి బాహుబలి మంత్రం వేశాడు.. ఎక్కడ చూసినా దాని గురించే చర్చ . ఆఖరికి ఊరి రచ్చ బండ మీద కూడా బాహుబలి చర్చే..ఆ రేంజ్ కువెళ్లింది జక్కన్న సినిమా… విడుదలకు ముందే రికార్డ్స్ బ్రేక్ చేస్తూ దూసుకెలుతున్న బాహుబలి చిత్రంపై ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోయాయ్.ఇప్పుడు బాహుబలి సినిమా స్టోరిపై ఊహాగానాలు ఎక్కువయ్యాయి.ఎవరికి వారు తమకు తోచిన కథ ను తోచినట్టు చెబుతున్నారు. సోషల్ మీడియాలో బాహుబలి పేరుతో రోజుకో కొత్త కథ పురుడు పోసుకుంటోంది.కానీ అభిమానుల నుండి వచ్చిన అనేక స్టోరీలలో రెండు స్టోరీలు మాత్రం అందరిని ఆకర్షిస్తున్నాయి. అవేంటే ఓ లుక్కేద్దాం…
పురాణాలే ప్రేరణ గా నా సినిమాలుంటాయ్ అనే రాజమౌళి పాయింట్ ను, పుస్తకాల్లోని బాహుబలి చరిత్రను లింక్ చేస్తూ ఓ అభిమాని బాహుబలి స్టోరి ని ప్రెడిక్ట్ చేశాడు. అతని ప్రకారం
అమర సింహ బాహుబలి కి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య కొడుకు రానా, ఇతడు రాజ్యాన్ని విస్తరించాలన్న కోరికతో తమ్ముళ్ళందరిపై దండయాత్ర చేస్తుంటాడు.బాహుబలి( ప్రభాస్) మినహా అందరూ రాజ్యాన్ని రానా కు అప్పజెబుతుంటారు. అన్న అయిన రానా దురాక్రమణ సహించలేని బాహుబలి(ప్రభాస్) అతనిని ఎదిరిస్తాడు. రానా, ప్రభాస్ ల మధ్య భీకర యుద్దం జరుగుతోంది. ఈ యుద్దంలో ప్రభాస్ చేతిలో రానా ఓడిపోతాడు. చివరకు రానా ను చేతులతో పైకెత్తి నేలకు కొట్టబోయి.. ప్రాణబిక్ష పెడతాడు బాహుబలి. దీంతో సినిమాకు ఎండ్ బోర్డ్ పడుతుంది.
మరో వీరాభిమాని ట్ర్రైలర్ ను ఆధారంగా చేసుకొని సినిమాను ఊహించాడు.. అతని ప్రకారం
ఓపెన్నింగ్ రెండు రాజ్యాల మధ్య భీకరయుధ్ధం. ఆ యుద్ధంలో సీనియర్ ప్రభాస్ చనిపోతాడు. అప్పుడు జూనియర్ ప్రభాస్ చిన్నపిల్లాడు. సముద్రంలోనుంచి చెయ్యి పైకెత్తి కాపాడినదిప్రభాస్ (బాహుబలి) నే, ఆ కాపాడినామె శివగామి(రమ్యకృష్ణ). అలా శత్రువల నుంచి తప్పించుకుని ఎక్కడో దూరంగా పెరుగుతాడు బాహుబలి. కట్ చేస్తే కొన్నిరోజుల తర్వాత తన తండ్రి పాలించిన ప్రాంతానికి ప్రభాస్ అనుకోకుండా వెళ్తాడు. అక్కడ ప్రభాస ఆ ప్రజలు బాహుబలిని చూసి నమస్కరిస్తారు. దేవుడిలా చూస్తారు. ప్రభాస్ తమన్నాతో ప్రేమలో పడతాడు, తమన్నా రానా చెల్లెలు..రాజ్యం మరియు తమన్నా విషయంలో రానా ప్రభాస్ లమధ్య బీకర యుద్దం జరుగుతోంది. నేనెప్పుడూ చూడని కళ్లు నన్ను దేవుడిలా చూస్తున్నాయి…. నేనెవర్నీ….? అని ట్ర్రైలర్ లోచెప్పించిన మాటలు దీనికి బలం చేకూర్చుతున్నాయ్.
ఊహాగానాలు ఎలా ఉన్నా బాహుబలి టాలీవుడ్ చరిత్రలోనే మైలు రాయిగా నిలుస్తోందని తెలుగు ప్రేక్షకులందరూ ముక్తకంఠంతో అంటున్నమాట. తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ రేంజ్ కు తీసుకెళ్తున్న రాజమౌళి కి బెస్ట్ ఆఫ్ లక్.. ఆల్ ది బెస్ట్ బాహుబలి.