“బాహుబలి” సినిమాలో ఇవి మీరు గమనించారా? “రాజమౌళి” బాహుబలి -2 లో ఏం చూపించనున్నాడో చెప్పేసాడు కదా!

రెండు సంవత్సరాల నుండి సినిమా అభిమానులందరికి ఉన్న అతి పెద్ద డౌట్ ఏంటంటే “కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?”. రాజమౌళి పెద్ద సస్పెన్స్ లో వదిలేసాడు ఆడియన్స్ ని! మార్చ్ 16 న ట్రైలర్ విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్, పోస్టర్స్ కూడా సోషల్ మీడియా లో హల్చల్ చేసాయి! కానీ బాహుబలి సినిమాని కొంచెం ఈ కోణంలో ఆలోచిస్తే “బాహుబలి -2 ” లో జక్కన్న ఏం చూపించనున్నాడు గెస్ చేయొచ్చు!

#1. “బాహుబలి – 1 ” సినిమా స్టార్టింగ్ లో “శివుడు” ని తీసుకొని “శివగామి” రాజ్యం వదిలి పారిపోతుంది. ఈ సీన్ లో “రమ్య కృష్ణ” గారి డ్రెస్ గుర్తుపెట్టుకోండి!

#2. “పిచ్చి దానిలా కనిపిస్తునాన? చితి పేరుస్తున!” అని “దేవసేన” కట్టప్పతో చెప్పే సన్నివేశం గుర్తుందా? అంటే “బాహుబలి -2 ” క్లైమాక్స్ లో “బల్లదేవుడిని” మన శివుడు అదే చితిపై పడుకోపెడతాడు అన్నమాట!

#3. “నిప్పులే శ్వాసగా” సాంగ్ లో “శివుడు” మాహిష్మతి రాజ్యం కి వెళ్లే దారిలో ఈ కింద సీన్ చూడచ్చు. ఆ సీన్ లో పక్కన ఒకరి విగ్రహం విరిగిపోయి పడుంటుంది. ఆ విగ్రహం “అమరేంద్ర బాహుబలి” ది అయ్యుండచ్చు!

#4. “బాహుబలి” లో ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవ్వగానే… “అమరేంద్ర బాహుబలి” ని “శివగామి” ఎత్తుకుంటుంది. అప్పుడే “అమరేంద్ర బాహుబలి” వాళ్ళ తండ్రి మరణించారు అని వార్త వస్తుంది. అంటే “బాహుబలి -2 ” లో “విక్రమ దేవుడు, అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి” ఈ మూడు తారలను చూపిస్తారన్నమాట!

#5. మొదటగా చెప్పినట్టు స్టార్టింగ్ సీన్ లో “శివగామి” డ్రెస్ గుర్తుంది కదా!. “శివుడు” ని కాపాడాలని “శివగామి” రాజ్యం నుండి పారిపోతుంది. 

“శివుడు”ని తీసుకొని పారిపోయేముందు ఈ సీన్ లో తన ముందు “అమరేంద్ర బాహుబలి” మృతదేహం ఉంది ఉండొచ్చు!

#6. “శివుడు” కాలు తన తల పెట్టుకుంటాడు “కట్టప్ప”. అదే సమయంలో తన ఒంటిపై మొత్తం రక్తపు మరకలు ఉంటాయి. బహుశా యుద్ధం తరవాత సన్నివేశం ఇదే అనుకుంట. “అమరేంద్ర బాహుబలి” ని చంపిన తరవాత “దేవసేన, శివుడు” కూడా ప్రమాదం లో ఉన్నారని తెలిసి. “దేవసేన” ను బందీగా కాకుండా కాపాడాలా? లేక “శివుడు” ను కాపాడాలా? అని ఆలోచించి “శివగామి” ని “శివుడు” తో రాజ్యం నుండి తప్పించాలనే నిర్ణయం తీసుకుంటాడు. అదే చివరిసారిగా కట్టప్ప “శివుడు” ని చూసేది!

#7. “బాహుబలి” ని “కట్టప్ప” చంపిన సీన్ లో…పక్కన కొన్ని మృతదేహాలు ఉన్నాయి..అవి “కాలకేయులవి”. “కాలకేయ రాజులు” మొత్తం ముగ్గురు సోదరులు. “ప్రభాకర్” చనిపోయిన తరవాత మిగిలిన ఇద్దరు సోదరులు “మాహిష్మతి” పై యుద్దానికి వస్తారు. అదే యుద్ధం లో “బాహుబలి” ని “కట్టప్ప” చంపేస్తాడు అన్నమాట!

#8. “యుద్ధం” జరిగిన తరవాత “కుంతల” రాజ్యం వైపు “బాహుబలి, భల్లాలదేవుడు” వెళతారు. అక్కడ రాకుమారి “దేవసేన” పై ఇద్దరు మనసు పడతారు. కానీ “దేవసేన” బాహుబలిని పెళ్లి చేసుకుంటుంది!

#9. “బాహుబలి” రాజుగా పట్టాభిషిక్తుడు అవుతాడు అని “శివగామి” ప్రకటిస్తుంది. కానీ ఈ సీన్ లో చూస్తే “సింహాసనం” పై “భల్లాలదేవుడు” ఉంటాడు. అదే సీన్ లో “బాహుబలి” కూడా కనిపిస్తాడు!. అంటే రాజు “భల్లాలదేవుడు” అయ్యిండచ్చు!

#9. ఈ పోస్టర్ లో “శివుడు” చేతిలో “సంకెళ్లు” ఉంటాయి. “దేవాసన” ను బంధించిన సంకెళ్లను ఆయుదంగా ఉపయోగించి “భళ్లాలదేవుడిని”  శివుడు చంపుతాడన్నమాట

credits: Srujan Malladi

Comments

comments

Share this post

scroll to top