“బాహుబలి” లో కనిపించిన ఆ 18 రోజుల చిన్నారి ఎవరో తెలుసా..? చిన్నారి గురించి షాకింగ్ నిజాలు ఇవే..!

బాహుబలి సినిమాలో కనిపించిన ఈ చిన్న బాబు గుర్తున్నాడా..?

బాహుబలి – 1 లో ఈ సన్నివేశాల్లో చిన్న బాబును చూడొచ్చు.

#1. సినిమా మొదలవ్వగానే…”రమ్య కృష్ణ” మహేంద్ర బాహుబలి (శివుడు)ను ఎత్తుకొని పారిపోతుంటది, పరమేశ్వరా ఈ బిడ్డను కాపాడు అని ఆకాశం వైపు చూపిస్తుంది.

#2. ఫ్లాష్ బ్యాక్ మొదలవ్వగానే…”అమరేంద్ర బాహుబలి” ని ఎత్తుకొని మహారాణిగా ఆస్థానంలోకి వెళుతుంది “శివగామి”. బాహుబలి అని పేరు పెట్టేది కూడా అప్పుడే.

#3. తర్వాత ఇద్దరు పిల్లలకి పాలు ఇస్తుంది. “మమతల తల్లి” సాంగ్ మొదలవుతుంది.

బాహుబలి – 2 లో ఈ సన్నివేశాల్లో చిన్న బాబును చూడొచ్చు.

#1. దేవసేన తన భర్త మరణించాడు అని తెలియగానే మాహిష్మతి రాజ్యం లోకి వస్తుంది.  కట్టప్ప ఎత్తుకుంటాడు.


#2. శివగామి మహేంద్ర బాహుబలి అని మాహిష్మతి ప్రజలకు చూపెడుతుంది.


#3. కట్టప్ప తన తలపై బాహుబలి కాలు పెట్టుకుంటాడు.


ఇక్కడ మీరు గమనించారా “బాహుబలి -1 ” , “బాహుబలి -2 “…రెండు భాగాల్లో చూపించింది ఒక చిన్నారిని. “మహేంద్ర బాహుబలి”, “అమరేంద్ర బాహుబలి” గా ఒకరినే చూపించారు. ఇంతకీ ట్రైలర్స్ లో, పోస్టర్లో వైరల్ అయిన ఆ చిన్నారి ఎవరు..?

ఆ బేబీ పేరు “అక్షర“. 18 రోజుల వయసులోనే “బాహుబలి” సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ముందుగా “రాజమౌళి” గ్రాఫిక్స్ లో పిల్లోడిని చూపించాలి అనుకున్నాడు. కానీ ఒరిజినల్ పిల్లాడిని చూపించాలి తర్వాత పట్టుపట్టారు. బాహుబలి – 1 షూటింగ్ “కేరళలోని అతురపల్లి జలపాతాల వద్ద” షూటింగ్ జరుగుతున్నప్పుడు. అదే సమయంలో “కేరళ అంగన్వాడీ ప్రాంతం” కి చెందిన “వల్సన్” అనే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ పని చేస్తుండగా అతనికి “అక్షర” జన్మించింది. రాజమౌళి అడిగేసరికి ఆ చిన్నారిని సినిమాలో చూపించడానికి అభ్యంతరం చెప్పలేదు ఆ తల్లితండ్రులు. షూటింగ్ జరిగినంత సేపు ఆ చిన్నారితో పాటు ఆ తల్లి కూడా అక్కడే ఉంది. ఏదేమైనా 18 రోజుల వయసులోనే దేశం గర్వించే సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది “అక్షర”

 

 

 

 

 

 

 

 

 

Comments

comments

Share this post

scroll to top