“బాహుబలి – 2 ” ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా..? అసలు “షేర్ , గ్రాస్” కలెక్షన్స్ అంటే ఏంటి..?

“కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు..?” అనే ప్రశ్నకు జవాబు దొరికేసింది. “బాహుబలి – 2 ది కంక్లూషన్” ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది.  రికార్డుల వరద సృష్టించింది. ప్రపంచానికి తెలుగు సినిమా గొప్పతనం ఏంటో పరిచయం చేసారు మన “జక్కన”. సినిమా చూసిన ఆడియన్స్ అందరు బాహుబలి పై ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. అసలు బాహుబలి సినిమాను వర్ణించలేము అంట. అంత హై రేంజ్ లో ఉంది మూవీ..!

బాహుబలి – 1 కలెక్షన్స్ లో ఎలాంటి సునామి సృష్టించిందో అందరికి తెలిసిందే. 500 కోట్ల బడ్జెట్ తో బాహుబలి రెండు పార్టీలు తెరకు ఎక్కించారు. దానికి ఎన్నో రెట్లు వాసులయ్యింది సినిమా విడుదలతో. 1000 కోట్లకి డిస్ట్రిబ్యూటర్ రైట్స్ అమ్ముడుపోయింది. సినీ పరిశ్రమలో ఇది అత్యధికం.

అయితే మొదటి రోజు భారత దేశంలో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా..?

  • ఆంధ్రప్రదేశ్ & నిజాం – 55 కోట్లు
  • హిందీ – 38 కోట్లు
  • కర్ణాటక – 12 కోట్లు
  • కేరళ – 9 కోట్లు
  • తమిళనాడు – 11 కోట్లు

మొత్తం – 125 కోట్లు మొదటి రోజున

కలెక్షన్స్ లో “షేర్”, “గ్రాస్” అని రెండు పదాలు వింటుంటాము. అసలు “షేర్” అంటే ఏంటి? “గ్రాస్” అంటే ఏంటి..?

“షేర్” కలెక్షన్స్:

  • ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సినిమాను థియేటర్ వాళ్లకు అమ్మే ధరను “షేర్” అంటారు!

“గ్రాస్” కలెక్షన్స్:

  • థియేటర్ లో టిక్కెట్లు అమ్మిన తరవాత వచ్చే కలెక్షన్స్ ని “గ్రాస్” అంటారు!

Comments

comments

Share this post

scroll to top