“బాహుబలి – 2 ” ఎలా ఉండబోతుందో 2015 లో ఊహించి ఈ షార్ట్ ఫిలిం తీశారు..! సినిమా ఇప్పుడు అచ్చం అలాగే ఉంది..!

“కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు..?” అనే ప్రశ్నకు జవాబు దొరికేసింది. “బాహుబలి – 2 ది కంక్లూషన్” ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. రికార్డుల వరద సృష్టించింది. ప్రపంచానికి తెలుగు సినిమా గొప్పతనం ఏంటో పరిచయం చేసారు మన “జక్కన”. సినిమా చూసిన ఆడియన్స్ అందరు బాహుబలి పై ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. అసలు బాహుబలి సినిమాను వర్ణించలేము అంట. అంత హై రేంజ్ లో ఉంది మూవీ..!
సినిమా రిలీజ్ కి ముందు సినిమా కథ ఏమయ్యి ఉంటుంది అని మనం ఎన్నో ఊహించుకున్నాం. అలా ఒకరి ఊహలోనుంచి పుట్టింది ఒక షార్ట్ ఫిలిం. బాహుబలి – 2 ఎండింగ్ ఇలా ఉండొచ్చు అని కామెడిగా “శ్రీకాంత్ రెడ్డి” అనే షార్ట్ ఫిలిం డైరెక్టర్ 2015 లో ఓ షార్ట్ ఫిలిం తీశారు. యూట్యూబ్ లో ఎన్నో లక్షల వ్యూస్ వచ్చాయి వీడియోకి. ఇప్పుడు సినిమా చూసిన తరవాత అతను కరెక్ట్ గా ఊహించాడు అనిపించింది. ఒకసారి షార్ట్ ఫిలిం చూడండి. తరవాత సినిమాలో మరియు షార్ట్ ఫిలిం లో మ్యాచ్ అయినా పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం!

#1. కుంతల రాజ్యం లో దేవసేన కత్తి తిప్పుతుండగా బాహుబలి చూడటం లవ్ లో పడిపోవడం (ఇక్కడ ఎగ్స్యాక్ట్ గా దేవసేన కాస్ట్యూమ్, లోకేషన్ మ్యాచ్ అయింది  చూడండి   )

#2. శివగామి దేవసేనను బల్లాలదేవకు ఇచ్చి పెళ్లి చేస్తాననడం(దేవసేన చిత్ర పటం ముందు మాట్లాడుకోవడం)

#3. తల్లిని(శివగామిణి) ఎదురించి బాహుబలి దేవసేనను పెళ్లి చేసుకోవడం అందుకోసం తన పట్టాభిషేకాన్ని వదిలేసుకోవడం   భల్లాలదేవ రాజవ్వడం (రీసన్ వేరైనా సేమ్ ఫీలింగ్ వచ్చేలా ఆ లోకేషన్ తీశాడు శ్రీకాంత్ రెడ్డి ఆల్‌మోస్ట్ ఇక్కడైతే బాహుబలి 2 చూస్తుంటే బాహుబలి 2 షోర్ట్‌ఫిల్మ్ స్పూఫ్ గుర్తుకు వస్తోంది)

#4. బాహుబలి అండ్ దేవసేన  అడవులకు/ విలేజ్ లోకి వెళ్లిపోవడం అక్కడ కట్టెలు/రాళ్లు కొట్టుకుంటూ బతకడం… (సేమ్ టు సేమ్)

#5. శివగామి చెప్పినదాన్ని కట్టప్ప బాహుబలిని చంపడం ఆ తర్వాత భల్లాలదేవుడు బాహుబలిని పొడవడం….( ఇది కూడా ఇంచుమించుగా  కాకపోతే రీసన్ వేరు బట్ ఇంతలా ఇమ్యాజిన్ చేయడం మామూలు విషయం కాదుగా) హ్యాట్స్ ఆఫ్ శ్రీకాంత్ రెడ్డి

#6. శివగామి  చిన్న బాహుబలిని తీసుకొని పారిపోతుండగా  భల్లాలాదేవ బాణం వేయడం……. (ఇది మాత్రం ఎక్స్‌ట్రార్డినరీ..శివగామికి బాణం వేసింది ఎవరో ఊహించడం చాలా కష్టం  కానీ దాన్ని కరెక్ట్ గా గెస్ చేసి కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు శ్రీకాంత్ రెడ్డి హ్యాట్స్ ఆఫ్)

#7. దేవసేనను భల్లాలాదేవ బంధించడం… ( ఇది కామన్)

#8. ఫైనల్ గా వార్……..(కాకపోతే ఇక్కడ అస్లామ్ ఖాన్ హెల్ప్ మాత్రం తీసుకోలేదు రాజమౌళి గారు)

మొత్తం మీద ఇది ఎవ్వరినీ కించ పరచడానికి చేసింది మాత్రం కాదు …..  2015 లోనే తనలో ఉన్న ఊహా శక్తిని చూపించిన  ఒక షోర్ట్‌ఫిల్మ్ డైరెక్టర్ టాలెంట్ ని బయట పెట్టడం మాత్రమే …. రాజమౌళి గారు దేశం గర్వించదగ్గ సినిమా తీశారు.. మనం గర్వ పడేలా చేశారు…హ్యాట్స్ ఆఫ్ సర్…       ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళను గుర్తించడం చాలా అవసరం అనిపించింది… బయటికి తీయాలే కానీ రాజమౌళి  లాంటి దిగ్గజాలు మనలొ కూడా చాలా మందే ఉన్నారు……..    అర్థం చేసుకుంటారానుకుంటాను

Watch Video: BAHUBALI 2 SPOOF.

 

Comments

comments

Share this post

scroll to top