ప‌ల్లె బ‌తుకుల‌ను ప్ర‌తిబింబించే ఫోటోలు.! ప్ర‌తి ఫోటోకి త‌న‌దైన అంత‌రంగం.!!

క్లిక్-1 : అమాయ‌క‌పు క‌ళ్ళు ….తీక్ష‌ణ‌మైన చూపు!

రంగు వెలిసిన గోడ‌ల మ‌ద్య… స్కూల్ డ్రెస్ లో రేప‌టి రంగుల‌ భ‌విష్య‌త్ పై పూర్తి విశ్వాసంతో ఉన్న అమ్మాయి.

క్లిక్-2:  నీ జ‌త‌గా.

ప్రేమ చిహ్నాలైన పావురాల మూగ బాస‌లు.! ఆహ్వానం ప‌లుకుతూ ఒక‌టి, త‌న జ‌త‌ను చేరే తొంద‌ర‌లో మ‌రోటి.!


క్లిక్ – 3:  చిలుక‌మ్మ దాహం ..తీర్చిందా ఆ పానియం.!!
అల‌సి సొల‌సిన చిలుక‌మ్మ‌ను ఆహ్వానించి మ‌రీ త‌న పాల‌ధార‌ల‌ను పంచుతున్న తాటిచెట్టు.!!

ఇలా…ప్ర‌తి క్లిక్ గురించి చెప్పుకుంటూ పోతే…. మొత్తం 32 అద్భుతాల గురించి చెప్పాల్సి వ‌స్తుంది.! ఇలా ప‌ల్లెటూరి బ‌తుకు చిత్రాన్ని ఫ్రేమ్ లు గా మ‌న ముందుంచే ప్ర‌య‌త్నం చేశాడు ఓ యువ‌కుడు., అత‌నే అజ‌హార్ షేక్ . వృత్తి ప‌రంగా జ‌ర్న‌లిస్ట్ అయిన అజ‌హార్ కు ప్ర‌కృతి సోయ‌గాల‌ను, ప‌ల్లెటూరి విశిష్ట‌త‌ల‌ను ఫోటోల‌లో బంధించ‌డం ప్ర‌వృత్తి . అలా వివిధ సంద‌ర్భంలో అత‌ను తీసిన ఫోటోల‌ను ….. సంద‌ర్శ‌కుల కోసం ర‌వీంద్ర‌భార‌తిలో ఫోటో గ్యాల‌రీ ఏర్పాటు చేశాడు.

AZHAR SHAIK:


ఎప్పుడు:  ఫిబ్రవరి 2, 3, 4 మూడు రోజుల పాటు ఉదయం గం. 11:00 నుండి సాయంత్రం గం. 7:00 వరకు

ఎక్క‌డ:  రవీంద్రభారతి లోని ఐసీసీఆర్ ఆర్ట్ గ్యాలరీలో

అతిథులు :

  • గౌరవ అతిథి : కట్టా శేఖర్ రెడ్డి ( నమస్తే తెలంగాణ పత్రిక ఎడిటర్ )
  • ముఖ్య అతిథి : గొంగిడి సునీత ( ఆలేరు ఎమ్మెల్యే ), MLC  కర్నె ప్రభాకర్
  • ఆత్మీయ అతిథి : మామిడి హరికృష్ణ ( తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ )

 

Comments

comments

Share this post

scroll to top