చలి పులి చంపేస్తోంది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా చలికాం విజృంభిస్తోంది. ఇంకా మరో 3 నెలలు చలికాలం ఉండగానే చలి ఇప్పుడు భీకర రూపం దాల్చింది. ఉదయం 11 గంటలు అయ్యే వరకు కూడా మంచు దుప్పటి పోవడం లేదు. దేశంలో అనేక ప్రాంతాలు చలి తీవ్రతతో గడ గడా వణుకుతున్నాయి. దీంతో వేడి కోసం జనాలు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరిస్తున్నారు. అయితే ఇంత వరకు బాగానే ఉంది. కానీ.. చలి తీవ్రతకు తట్టుకోలేక దేవుడు కూడా వేన్నీళ్ల స్నానం చేస్తే..? రూమ్ హీటర్లను పెట్టుకుంటే..? ఎలా ఉంటుంది..! వినేందుకు ఫన్నీగా ఉంది కదా. కానీ ఇది నిజమే. అంటే అక్కడ.. దేవుడు వాటిని పెట్టుకోలేదు. జనాలే వాటిని పెట్టారు.
ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో ఉన్నజానకీ ఘాట్ బడా స్థాన్ ఆలయంలో కొలువైన దేవుడికి ఆ ఆలయ పూజారులు వినూత్న రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు. చలి కాలం కావడంతో దేవుడికి బాగా చలి ఉంటుందని చెప్పి వారు వేన్నీళ్లతో విగ్రహాలకు జలాభిషేకం చేస్తున్నారు. అంతేకాదు, వారు ఇంకా కొంత ముందుకు వెళ్లి ఆలయ గర్భ గుడిలో దేవుడి విగ్రహాల పక్కన రూమ్ హీటర్లను పెట్టారు. దీంతో ఆ ప్రదేశంలో వేడి ఉంటుందని, తద్వారా దేవుడికి చలి తగలకుండా వెచ్చగా ఉంటాడని వారు భావిస్తున్నారు. అందుకే ఆ ఏర్పాట్లు చేశారు.
A temple in Uttar Pradesh has installed heater for the idols inside because weather is very cold.
In other news, not enough shelters in Delhi, homeless stranded in cold.
Is our country really developing?
— Varun Shetti (@ShettiVarun) December 22, 2017
they should also appoint doctors to keep a check on idols health 24/7
— my name is khan (@ataullakhan1) December 21, 2017
Never heard of such strange things before. It happens in 21st century India talking of space
— vijay banga (@lekh27) December 21, 2017
Wow. UP is so progressive.
— Misanthrope (@Weird_Wanderer) December 21, 2017
I would have believed this if they had announced the heater is for pandits in the sanctum and others!!
Bhagwaan ko cold se bachao!!#Godkosardi https://t.co/7jZFZG8fTq
— Aaditya Singh (@aa_aaditya) December 21, 2017
అయితే వారు అలా ఏర్పాటు చేయడం ఏమో గానీ ఇప్పుడు ఈ విషయం పట్ల సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ముఖ్యంగా ట్విట్టర్లో నెటిజన్లు రెచ్చిపోతున్నారు. ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. దేశంలో కనీసం నివసించేందుకు కూడా షెల్టర్ లేక ప్రజలు అల్లాడుతుటే, దేవుడికి వేన్నీళ్ల స్నానం, హీటర్లా..?, దేవుడి ఆరోగ్యం చెక్ చేసేందుకు 24 గంటల పాటు డాక్టర్లను కూడా పెట్టాల్సిది.., 21వ శతాబ్దంలోనూ ఇలాంటి వార్తలను వింటున్నందుకు సిగ్గుగా ఉంది.., ఉత్తర ప్రదేశ్ బాగా ప్రగతి సాధిస్తోంది.., గర్భ గుడిలో హీటర్లు దేవుడి కోసం కాదు, పూజారుల కోసం అయి ఉంటుంది.. అని చాలా మంది రక రకాలా కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా ఈ వివాదం ఇప్పట్లో తగ్గేలా లేదు. మరి దీనిపై మీరేమంటారు..!