లాఠీలు తరుముతున్నా, తూటాలు పేలుతున్నా, కొరడాలు తగులుతున్న, మానాలు దొచుకున్నా అంటూ హైపిచ్ లో స్టార్ట్ చేసి…తన అసంతృప్తిని తెలుపుతూనే… సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు ఆ కుర్రాడు తన మేల్కొలుపు గీతం తో .. పదాలనే తూటాలుగా వాడుతూ ప్రస్తుత పరిస్థితులను టార్గెట్ చేస్తూ అతడు అల్లిన పదాలు నిజంగా మేల్కొలుపు గీతాలే…. ఒకడేమో ప్రేమ పేరుతో, ఇంకొకడు కామ వాంఛ తో మదమెక్కిన చీకటి కోరిక బతుకులెందుకంటా.. ఒకతెమో డబ్బు పిచ్చితో, అందముందని వెర్రి పొగరుతో నీకు నువ్వే తూకమేసి ఖరీదు కట్టకింకా.. అంటూ ఓ వైపు అబ్బాయిల వ్యక్తిత్వాన్ని, మరోవైపు అమ్మాయిల మనస్తత్వాన్ని సూటిగా ప్రశ్నించాడు.
ఆడదాని కడుపునే పుట్టావుగా.ఆడపిల్ల పుడితే నువ్వు చంపకురా….మగవాడి నీడలో పెరిగావె, మగజాతి మీద నీకు కోపమెందుకులే.. స్త్రీ వాదం అంటే మగవాడి మీద ఇక పోరు ప్రకటేనేనా…? అంటూ స్త్రీ పురుషుల అవసరాన్ని అంతే సున్నితంగా తెలియజేశాడు.. వ్యక్తిగత స్వార్థం పై కూడా అంతే విమర్శనాత్మకంగా పాట రూపంలో సెటైర్ వేశాడు ఈ కుర్రాడు.
Watch Song: