బుల్లితెర ఆనంది అవికాగోర్‌కు యంగ్ హీరో వేధింపులు..!

తెలుగు బుల్లితెరకు ఆనందిగా ప‌రిచ‌య‌మై… అటు త‌రువాత ప‌లు తెలుగు సినిమాల్లో న‌టించి త‌నదైన న‌ట‌న‌తో పేరు తెచ్చుకున్న అవికాగోర్ గురించి తెలియ‌ని వారుండ‌రు. సినీ అభిమానుల క‌న్నా టీవీ సీరియ‌ల్ అభిమానుల‌కే ఆమె గురించి బాగా తెలుసు. అయితే ఈమె ఇటీవ‌లి కాలంలో ఓ విష‌యం ప‌ట్ల చాలా మ‌న‌స్తాపానికి గుర‌వుతోంద‌ట‌. ఇంత‌కీ ఆ విషయం ఏమిటంటే…

avika-gor

ప్ర‌స్తుత స‌మాజంలో ఏ రంగంలోనైనా, ఎక్క‌డైనా, ఎప్పుడైనా మ‌హిళ‌లు ఎదుర్కొంటున్న వేధింపులు, దాడుల గురించి అంద‌రికీ తెలిసిందే. చాలా మంది మ‌హిళలు పురుషుల నుంచి ఎదురయ్యే అలాంటి వేధింపుల‌కు ఏం చేయాలో తెలియ‌క స‌ర్దుకు పోతుంటే కేవ‌లం కొంద‌రు మాత్రమే అందుకు వ్య‌తిరేకంగా పోరాడుతున్నారు. వాటికి దీటుగా స‌మాధానం చెబుతున్నారు. ఇదిలా ఉంచితే… ప్ర‌స్తుతం న‌టి అవికాగోర్ కూడా ముందు చెప్పిన విధంగా వేధింపులు ఎదుర్కొంటూ ఏం చేయాలో తెలియ‌క మ‌న‌స్తాపం చెందుతోంద‌ట. అయితే అలా వేధింపుల‌కు గురి చేస్తోంది కూడా ఓ యంగ్ హీరోనే అట‌.

ఇటీవ‌లి కాలంలో స‌ద‌రు యంగ్ హీరో అవికా గోర్ వాట్స‌ప్‌కు అస‌భ్య‌క‌ర‌మైన మెసేజ్‌లు పంపుతూ వేధింపుల‌కు గురి చేస్తున్నాడ‌ట‌. మ‌రీ కొద్ది రోజుల నుంచైతే అలాంటి వేధింపులు ఇంకా ఎక్కువ‌య్యాయ‌ట‌. అయితే మొద‌ట అవికా అలాంటి మెసేజ్‌ల‌ను ఆక‌తాయిల ప‌ని అనుకుని లైట్ తీసుకుంద‌ట‌. కానీ త‌రువాతే ఆమెకు తెలిసింద‌ట, వాటిని ఓ యంగ్ హీరో పంపుతున్నాడ‌ని. దీంతో ఈ విష‌యాన్ని ఆమె త‌న తోటి న‌టులైన రాజ్ త‌రుణ్‌, నిఖిల్‌, సాయి ధ‌ర‌మ్ తేజ్, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, హెబ్బా ప‌టేల్‌ల‌కు చెప్పి వాపోయింద‌ట‌. వాళ్లుకు ఆమెకు ధైర్యం చెప్పార‌ట‌. అయితే అవికా మాత్రం వాళ్ల‌తో ఏమందంటే… అలాంటి అస‌భ్య కామెంట్ల వ‌ల్ల తెలుగు యువ హీరోల‌పై త‌న‌కు గౌర‌వం త‌గ్గుతోంద‌ని, వారి ప‌క్క‌న యాక్ట్ చేయాలంటేనే అదోలా ఉంది అంటూ కామెంట్ చేసింద‌ట‌. అవును మ‌రి, అలాంటి ప‌రిస్థితిలో ఉంటే ఏ న‌టికైనా అలాగే అనిపిస్తుంది. అయితే ప్ర‌స్తుతానికి మాత్రం ఆ యంగ్ హీరో ఎవ‌ర‌నేది తెలియ‌డం లేద‌ట. అతన్ని ట్రేస్ చేసి గుర్తిస్తామ‌ని అవికా తోటి స‌హ‌చ‌ర న‌టులు ఆమెకు చెప్పిన‌ట్టు తెలిసింది.

Comments

comments

Share this post

scroll to top