“వాట్సాప్ గ్రూప్” లకు హెచ్చరిక..! ఆ సిరీస్ నంబర్స్ ఉంటే వెంటనే తీసేయండి.! పొరపాటున షేర్ చేసారో.?

వాట్సాప్‌.. నేటి త‌రుణంలో ఇది మ‌న జీవ‌న విధానంలో ఎలా భాగం అయిందో అంద‌రికీ తెలిసిందే. నిత్యం ప్ర‌తి రోజూ, ప్ర‌తి గంట‌, ప్ర‌తి నిమిషం మ‌నం వాట్సాప్ ప్ర‌పంచంలో విహ‌రిస్తున్నాం. అనేక విష‌యాల‌ను అందులో షేర్ చేసుకుంటున్నాం. వాయిస్‌, వీడియో కాల్స్ చేసుకుంటున్నాం. ఇంకా అనేక ఇత‌ర స‌దుపాయాల‌ను మ‌నం వాట్సాప్‌లో పొందుతున్నాం. అయితే ఈ విష‌యం మాటేమోగానీ ఇప్పుడిదే వాట్సాప్ మ‌న స‌మాచార భ‌ద్ర‌త‌కు ముప్పుగా మారింది. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. వాట్సాప్‌ను ల‌క్ష్యంగా చేసుకుని కొంద‌రు చైనా హ్యాక‌ర్లు ఇప్పుడు భార‌త వాట్సాప్ యూజ‌ర్ల అకౌంట్ల‌ను హ్యాక్ చేస్తున్నార‌ట‌.

చైనాకు చెందిన కొంద‌రు హ్యాకర్లు ఇప్పుడు భార‌త్‌లోని వాట్సాప్ వాడే యూజ‌ర్ల అకౌంట్లు హ్యాక్ చేస్తున్న‌ట్లు భార‌త ఆర్మీ అధికారులు వెల్ల‌డించారు. దీంతోపాటు వాట్సాప్ అకౌంట్‌ను హ్యాక్ చేసిన వెంట‌నే స‌ద‌రు యూజ‌ర్ వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని కూడా దొంగిలిస్తున్నార‌ని ఆర్మీ చెబుతోంది. ప్ర‌ధానంగా +86 అనే సంఖ్య‌తో ప్రారంభం అయ్యే ఫోన్ నంబ‌ర్ల ద్వారా వాట్సాప్ అకౌంట్లు హ్యాక్ అవుతున్న‌ట్లు అదనపు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ (ADGPI) అనే భార‌త ఆర్మీ విభాగం హెచ్చ‌రించింది. ఈ మేర‌కు ఆ సంస్థ ట్విట్ట‌ర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది.

+86 అనే సంఖ్య‌తో ప్రారంభం అయ్యే ఫోన్ నంబ‌ర్లు భార‌త యూజ‌ర్ల వాట్సాప్ గ్రూప్‌ల‌లో యాడ్ అవుతున్నాయ‌ని, అలా యాడ్ కాగానే ఆ గ్రూప్‌ల‌లో ఉండే యూజ‌ర్ల వాట్సాప్ ఖాతాలు హ్యాక్ అయి వారి వ్య‌క్తిగ‌త స‌మాచారం హ్యాక‌ర్ల‌కు చేరుతుంద‌ని ADGPI వెల్ల‌డించింది. క‌నుక వాట్సాప్ యూజ‌ర్లు ఎవ‌రైనా +86 అనే సంఖ్య‌తో ప్రారంభ‌మ‌య్యే ఫోన్ నంబ‌ర్ల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, ఆ నంబ‌ర్‌తో ఎవ‌రైనా వాట్సాప్ గ్రూపుల్లో యాడ్ అయితే వెంట‌నే వారిని తొల‌గించాల‌ని, లేదంటే స‌మాచారం చోరీ అయి హ్యాక‌ర్ల‌కు చేరుతుంద‌ని అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. క‌నుక మీరు కూడా ఈ నంబ‌ర్ ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండండి. లేదంటే ఎంతో విలువైన మీ వ్య‌క్తిగ‌త స‌మాచారం హ్యాక‌ర్ల చేతుల్లోకి వెళ్తుంది. త‌రువాత బాధ‌ప‌డీ ప్ర‌యోజనం ఉండ‌దు.

Comments

comments

Share this post

scroll to top