టీవీలు అన్నాక వాటిలో మనం చూసే చానల్స్‌లో యాడ్స్ రావడం కామన్. అనేక రకాల ఉత్పత్తులకు సంబంధించిన యాడ్స్‌ను మనం నిత్యం పలు చానల్స్‌లో చూస్తుంటాం. అయితే కొన్ని రకాల యాడ్స్ మాత్రం అడల్ట్ కంటెంట్‌ను కలిగి ఉంటాయి. ముఖ్యంగా కండోమ్‌లకు సంబంధించినవి. ఈ యాడ్స్‌లో ఆ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇలాంటి యాడ్స్‌ను కుటుంబ సభ్యులతో కలిసి చూడడం ఇబ్బందిగానే ఉంటుంది. దీనికి తోడు ఈ తరహా యాడ్స్ చిన్న పిల్లలపై ప్రభావాన్ని చూపుతాయి కూడా. అయితే ఇకపై ఇలాంటి యాడ్స్‌ను కేవలం రాత్రి పూట మాత్రమే ప్రదర్శించనున్నారు.
ఇకపై కండోమ్‌లకు చెందిన యాడ్ ఏదైనా సరే అది రాత్రి పూట మాత్రమే ప్రదర్శితమవుతుంది. రాత్రి 10 గంటలు దాటాక, ఉదయం 6 లోపు అలాంటి యాడ్స్‌ను ప్రదర్శించాలని సంబంధింత మంత్రిత్వ శాఖ తాజాగా టీవీ చానల్స్ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇకపై ఇలాంటి యాడ్స్ పగటి పూట రావు. వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టవు. దీనికి తోడు పిల్లలతో కలిసి టీవీ చూడవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు.
అయితే కండోమ్ యాడ్స్‌ను రాత్రి పూట ప్రదర్శించడం వల్ల అసలు చేరాల్సిన వారికి ఆ మెసేజ్ చేరదని పలు స్వచ్ఛంద సంఘాలు తెలుపుతున్నాయి. ఇప్పటికే దేశంలో అవాంఛిత గర్భాలు పెరిగిపోయాయని, రాను రాను ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల సంఖ్య కూడా పెరుగుతుందని వారు అంటున్నారు. అలాంటి తరుణంలో కండోమ్ యాడ్స్‌ను నిలిపి వేస్తే వాటిపై జనాలకు అవగాహన ఎలా వస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి యాడ్స్‌ను నిలిపి వేస్తే అది మరో రకంగా వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుందని అంటున్నారు. అయినప్పటికీ కేంద్రం మాత్రం కండోమ్ యాడ్స్‌ను రాత్రి పూట మాత్రమే ప్రదర్శించాలని ఆదేశాలు ఇచ్చింది. చూద్దాం మరి.. ఈ విషయం ఇంకా ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో..!